Nayanthara Weds Vignesh: నయనతార, విఘ్నేష్‌ల పెళ్లి ఫోటో రిలీజ్
నయనతార (Nayanthara), విఘ్నేష్‌ల పెళ్లి వైభవంగా జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో నయన్, విఘ్నేష్‌లు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయనతార.. లేటెస్టుగా తన పెళ్లి ఫోటోను పోస్ట్ చేశారు. తన ట్విట్టర్‌లో కొన్ని నిమిషాల ముందు అభిమానులకు తన పెళ్లి పిక్‌ను షేర్ చేశారు.
నయన్, విఘ్నేష్‌ల పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు. రజినీకాంత్ చేతుల మీదుగా తాళిని విఘ్నేష్‌కు అందించారు. రజనీతో పాటు బంధు మిత్రుల సమక్షంలో .. వేద మంత్రాల నడుమ.. విఘ్నేష్ శివన్ నయనతారకు మూడు ముళ్లు వేశారు. తర్వాత, పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నూతన వధూవరులుగా వందేళ్ల జీవిత ప్రయాణానికి ఆహ్వానం పలికారు నయన్ (Nayanthara),, విక్కీల జంట.