'చెస్' ఆట ఎంతో ఇష్ట‌మ‌న్న ర‌జ‌నీకాంత్ (Rajinikanth)!.. కూతురుతో క‌లిసి చెస్ పోటీల‌కు హాజ‌రైన‌ త‌లైవా

Updated on Jul 30, 2022 10:33 AM IST
త‌న‌కు న‌చ్చిన ఇండోర్ గేమ్ చెస్ అంటూ ర‌జ‌నీకాంత్  (Rajinikanth) తెలిపారు. గ‌తంలో చెస్ ఆడే ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.
త‌న‌కు న‌చ్చిన ఇండోర్ గేమ్ చెస్ అంటూ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) తెలిపారు. గ‌తంలో చెస్ ఆడే ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

త‌మిళ‌నాడులో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్  (Rajinikanth) చెస్ ఆడే  ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. త‌న‌కు చెస్ ఆట అంటే అమిత‌మైన ప్రేమ అని తెలిపారు. చెస్ ఒలింపియాడ్ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ క్రీడాకారుల‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ర‌జ‌నీకాంత్ ఫోటోను చూసిన అభిమానులు సూప‌ర్ తలైవా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

చెన్నైలో చెస్ పోటీలు

44 వ చెస్ ఒలింపియాడ్ పోటీలు చెన్నైలోని మ‌హాబ‌లిపురంలో జ‌రుగుతున్నాయి. ఈ పోటీలు జూలై 30 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. వివిధ దేశాల‌కు చెందిన చెస్ క్రీడాకారులు ఈ పోటీల‌కు హాజ‌ర‌య్యారు. చెన్నై ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా చెస్ పోటీల‌ను ప్రారంభించింది. ర‌జ‌నీకాంత్ త‌న కూతురు ఐశ్వ‌ర్య‌తో క‌లిసి చెస్ పోటీల‌కు హాజ‌ర‌య్యారు.

చెస్ త‌న‌కు ఇష్ట‌మైన ఆట అంటున్న త‌లైవా

ఇండోర్ గేమ్‌గా చెస్ ఆట‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాన‌ని ర‌జ‌నీకాంత్ తెలిపారు. గ‌తంలో తాను చెస్ ఆడే ఓ ఫోటోను ట్విట్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ పోస్ట్ చేశారు. చెస్ ఒలంపియాడ్ 2002లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల‌ భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానానంద ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ను క‌లిశాడు. చెస్ పోటీల‌ కోసం చెన్నై వెళ్లిన ప్రజ్ఞానానంద ర‌జ‌నీకాంత్‌ను క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నాడు.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 'జైల‌ర్' అనే సినిమాలో న‌టిస్తున్నారు. త‌లైవా 169వ సినిమా 'జైల‌ర్' షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సినిమా నెల్సన్​ దిలీప్​కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Read More : ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ను క‌లిసిన చెస్ ఛాంపియ‌న్ ప్రజ్ఞానానంద

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!