Chandramukhi Sequel: 'చంద్రముఖి 2' లో హీరోగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) .. ఏకంగా 5 మంది హీరోయిన్లు?

Updated on Jul 27, 2022 06:09 PM IST
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో.. తెరకెక్కిన “చంద్రముఖి” (Chandramukhi Sequel) సినిమాకు 17 ఏళ్ల తర్వాత ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. 
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో.. తెరకెక్కిన “చంద్రముఖి” (Chandramukhi Sequel) సినిమాకు 17 ఏళ్ల తర్వాత ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. 

Chandramukhi Sequel: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005లో 'చంద్రముఖి' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. చంద్రముఖి పాత్రలో జ్యోతిక (Jyothika) నటన సినిమాకే హైలైట్. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన “చంద్రముఖి” సినిమాకు 17 ఏళ్ల తర్వాత మళ్ళీ సీక్వెల్ తెరకెక్కుతోంది. 

కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు (Director P vasu) ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభం కాకముందు లారెన్స్, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ మూవీలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.కాగా, 'చంద్రముఖి 2' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించనుంది. 

ఇక  'చంద్రముఖి 2' (Chandramukhi 2) లో ప్రధాన కథానాయికగా లక్ష్మీ మీనన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారట. వారిలో మహిమా నంబియార్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారట. అంతేకాదు, ప్రస్తుతం ఈమె మైసూరులో జరుగుతున్న షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. ఇక మిగిలిన నలుగురు హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది.

గతంలో లారెన్స్ (Raghava Lawrence) నుంచి వచ్చిన కామెడి హర్రర్ చిత్రాలు ముని, కాంచన, కాంచన 2, గంగ, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇదే జోనర్ లో “చంద్రముఖి” కి సీక్వెల్ తెరకెక్కుతుండడంతో, సినీ ప్రేమికులు లారెన్స్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే, వాస్తవానికి పి. వాసు గతంలోనే రజినీకాంత్‌తో “చంద్రముఖి” సీక్వెల్ చేయాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగిందట. కానీ కుదరక చివరకి లారెన్స్‌తో సీక్వెల్ చేస్తున్నారు.

Read More: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా 'చంద్రముఖి 2'.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!