రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth)! లైకా ప్రొడక్షన్స్‌తో డీల్‌?

Updated on Oct 08, 2022 04:10 PM IST
రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.  ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి
రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడికీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఆయన సొంతం. బస్‌ కండక్టర్‌‌ నుంచి సూపర్‌‌స్టార్‌‌గా ఎదిగిన రజినీ.. కొన్ని రోజులుగా కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు. ఈ క్రమంలో ఆయన సినిమాలు చేస్తారా?  చెయ్యరా? అనే సందేహం చాలా మందికి కలిగింది. జైలర్ సినిమా తప్పితే రజినీ మరే ప్రాజెక్ట్‌కూ ఓకే చెప్పలేదు.

ఇటీవల రజినీకాంత్ నటిస్తున్న సినిమాలు సక్సెస్‌ కాకపోవడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా వార్తలు వచ్చాయి. సినిమాల నుంచి రజినీకాంత్ రిటైర్‌‌కానున్నారనే ఊహాగానాలు కూడా హల్‌చల్‌ చేశాయి. దీంతో అభిమానులు ఎంతో నిరాశ చెందారు కూడా. అయితే ఇప్పుడు మరో వార్త రజినీ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది.

రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.  ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి

భారీగా రూపొందించే ప్లాన్..

సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ రెండు సినిమాలు చేయడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రెండు సినిమాలు చేసేందుకు లైకా ప్రొడక్షన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో రజినీకాంత్‌ ‘2.0’, ‘దర్బార్’ సినిమాలు చేశారు. ఇప్పుడు మరో రెండు సినిమాలు చేయడానికి ఓకే చెప్పారని టాక్.

ఈ రెండు సినిమాల్లో ఒక చిత్రాన్ని డాన్‌ సినిమాకు దర్శకత్వం వహించిన శిబి చక్రవర్తి, మరో సినిమాను డెసిగ్ను పెరియసామి డైరెక్ట్‌ చేస్తారని తెలుస్తోంది. భారీ ప్రాజెక్టులుగా ఈ రెండు సినిమాలను రూపొందించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్‌ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు. రజినీకాంత్ (Rajinikanth) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Read More : రజినీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay) వంటి స్టార్‌‌ హీరోల రెమ్యునరేషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!