‘ఎస్‌ఎస్‌ఎంబీ28’లో కొత్త గెటప్‌తో మాస్ ప్రేక్షకులను అలరించనున్న మహేష్‌బాబు (MaheshBabu)!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఆరంభం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ఎస్‌ఎస్‌ఎంబీ28పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మహేష్ అభిమానులను విపరీతంగా అలరించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా గురించిన అప్‌డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరినీ ఆశ్చర్యపరిచే ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.
అన్ని వర్గాలనూ అలరించేలా..
ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందనేది ఆ వార్త. అంతేకాదు ఎస్‌ఎస్‌ఎంబీ28లో మహేష్ పూర్తి మాస్ గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాతో మాస్ అభిమానులను మహేష్‌బాబు అలరిస్తారని టాక్. మహేష్‌బాబు క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, కెరీర్‌లో ఇప్పటివరకు అటువంటి క్యారెక్టర్‌ను ఆయన పోషించలేదని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు త్రివిక్రమ్.. మహేష్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని ఇండస్ట్రీ టాక్.
సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి హిట్ సినిమాల తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న సినిమా కావడం, అల వైకుంఠపురములో వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఎస్‌ఎస్‌ఎంబీ28పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. దీనిపై చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చింది.
అక్టోబర్ మూడో వారంలో..
విజయ దశమి తర్వాత ఎస్‌ఎస్‌ఎంబీ28 సెకండ్ షెడ్యూల్ మొదలవుతుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు. దీంతో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 10వ తేదీ తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నా.. అక్టోబర్ మూడో వారంలో సెకండ్ షెడ్యూల్ స్టార్టవుతుందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా నటిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాకు ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2023 వేసవి కానుకగా ఏప్రిల్ 28వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
Read More : సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)!