త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్‌లో మహేష్‌ బాబు (MaheshBabu).. జిమ్‌లో ట్రైనర్‌‌తో పిక్‌ వైరల్ !

Updated on Aug 16, 2022 07:37 PM IST
జిమ్‌ ట్రైనర్‌‌తో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది
జిమ్‌ ట్రైనర్‌‌తో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) కొత్త లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేష్ తన ప్రతీ సినిమాకు సరికొత్త లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. కథను బట్టి అందులోని పాత్రకు తగినట్టుగా ఆయన మేకోవర్ మారుతూ ఉంటుంది.

తన ఫిజిక్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు మహేష్. ఇప్పుడు ఆయన తన 28వ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఏ హంగూ ఆర్భాటం లేకుండా మొదలై, చాలా సైలెంట్‌గా జరుగుతోంది.

ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు పర్‌ఫెక్ట్ బాడీతో కనిపించేందుకు అనేక కసరత్తులు చేస్తున్నారు.

జిమ్‌ ట్రైనర్‌‌తో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది

నెట్‌లో పిక్ వైరల్..

తన సినిమా కోసం  పాపులర్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ నేతృత్వంలో, మహేష్ ఎక్సర్‌‌సైజ్‌లు చేస్తున్నారని టాక్. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మహేష్,  త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఇటీవలే విడుదలైంది. మహేష్ సతీమణి నమ్రత ఈ అప్డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

మహేష్ బాబు గతంలో నటించిన కొన్ని సినిమాల కోసం ఫిట్నెస్ సెంటర్లను ఆశ్రయించారు. ఇప్పుడు తన 28వ సినిమా కోసం ఎలా కనిపించబోతున్నారో తెలియాలంటే, కొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా, ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాను చేయనున్నారు మహేష్‌ (Mahesh Babu). ఈ సినిమా కోసం రాజమౌళి కథా చర్చల్లో నిమగ్నమై ఉన్నారు.  

Read More : Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్‌ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!