ఆ హీరోయిన్లు వద్దంటూ రాజమౌళికి షరతులు పెట్టిన మహేష్‌బాబు (Mahesh Babu).. నిజమెంత?

Updated on Jun 23, 2022 01:24 PM IST
రాజమౌళి, మహేష్‌బాబు
రాజమౌళి, మహేష్‌బాబు

సర్కారు వారి పాట’ సినిమా తర్వాత సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) తర్వాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. జూలై నెలలో మొదలుకానున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు మహేష్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రాజమౌళి, మహేష్‌బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమాను దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌ స్టోరీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళికి మహేష్‌ ఒక కండిషన్ పెట్టారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో టాలీవుడ్‌కు సంబంధించిన హీరోయిన్‌నే సెలక్ట్‌ చేయాలని షరతు విధించారట మహేష్.

మహేష్‌బాబుతో యాక్ట్‌ చేసిన హీరోయిన్లు

దాదాపు వాళ్లతోనే..

మహేష్‌బాబు సినిమాల్లో చాలా వరకు హిందీ హీరోయిన్లతోనే నటించారు. వారితో విసిగిపోయిన కారణంగానే ఈ షరతు పెట్టారని సమాచారం. ఇప్పటివరకు మహేష్‌ నటించిన చాలా సినిమాల్లో హీరోయిన్లుగా హిందీ వాళ్లే ఉన్నారు. అంతెందుకు మహేష్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు సినిమాలో ప్రీతీజింటా హీరోయిన్‌గా నటించింది.

ఆ తర్వాత బిపాషా బసు, లీసా రే, సోనాలి బింద్రే, నమ్రతా శిరోద్కర్, కృతి సనన్, అమృతారావు, కియారా ఆడ్వాణీ, పూజా హెగ్డేతో పనిచేశారు మహేష్. పైగా హిందీ హీరోయిన్లకు రకరకాల సదుపాయాలు కల్పించాల్సి వస్తుండడం, డిమాండ్స్ కూడా ఎక్కువగానే ఉండడంతో మహేష్‌బాబు (Mahesh Babu) ఈ షరతు పెట్టాడని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Read More: మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమాకు సైన్యం టైటిల్‌ను ఎప్పుడో ఫిక్స్ చేసిన త్రివిక్ర‌మ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!