కాలమే సమాధానం చెబుతుందంటున్న స్టార్ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Kaarthi).. లోకేశ్ డైరెక్షన్‌పై కామెంట్లు

Updated on Aug 05, 2022 10:51 AM IST
స్టార్ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Karthi), డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
స్టార్ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Karthi), డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’లో సూర్య (Suriya), కార్తీ (Kaarthi) కలిసి నటిస్తారా, లేదా?.. అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘విరుమన్‌’ సినిమా ట్రైలర్‌, ఆడియో విడుదల వేడుకలో ఇదే ప్రశ్న సూర్య, కార్తీలకు ఎదురైంది. దానికి వాళ్లు కూడా తమదైన శైలిలో స్పందించారు.

‘దానికి కాలమే సమాధానం చెప్తుంది. వేచి చూద్దాం’ అని చెప్పారు. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ తదితర సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. కొత్త కథలకు పాత సినిమాల్లోని క్యారెక్టర్లకు ముడిపెడుతూ సినిమాటిక్‌ యూనివర్స్‌ అనే కాన్సెప్ట్‌తో విజయం అందుకున్నారు లోకేశ్. ఆ నేపథ్యంలో వచ్చి సూపర్‌‌హిట్ సాధించిన సినిమానే ‘విక్రమ్‌’.

కార్తీ (Karthi) హీరోగా నటిస్తున్న విరుమన్ సినిమా పోస్టర్

కనిపిస్తారా? లేదా?

కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘ఏజెంట్‌ విక్రమ్‌’, ‘ఖైదీ’ సినిమాల్లోని క్యారెక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. ‘విక్రమ్‌’ సినిమాలోనే సూర్య.. రోలెక్స్‌ అనే క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించారు. కార్తి హీరోగా గతంలో రూపొందిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమాలో ఆయన ఢిల్లీ అనే క్యారెక్టర్‌‌ పోషించారు. ‘విక్రమ్‌’ సినిమాలోని ఒక సన్నివేశంలో ఢిల్లీ పాత్రకు సంబంధించి కార్తీ వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. కానీ ఆయన మాత్రం విక్రమ్ సినిమాలో కనిపించలేదు. దాంతో లోకేశ్‌ తెరకెక్కించే తర్వాతి సినిమాలో కార్తీ పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తారేమో, అన్నదమ్ములు (సూర్య, కార్తీ) కలిసి నటిస్తారా లేదా అనే ఆసక్తి మొదలైంది.

స్టార్‌‌ హీరో సూర్య (Suriya) తమ్ముడు కార్తీ (Kaarthi) హీరోగా దర్శకుడు ముత్తయ్య తెరకెక్కించిన సినిమా ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందిన విరుమన్‌ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల కానుంది.

Read More : రిపీట్‌ కానున్న జై భీమ్‌ కాంబినేషన్‌ : జ్ఞానవేల్‌తో మరో సినిమాకు తమిళ హీరో సూర్య (Suriya) ఓకే చెప్పాడని టాక్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!