లోకనాయకుడు కమల్‌హాసన్‌ సినిమాలో గెస్ట్ రోల్‌లో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya)

Updated on May 13, 2022 09:06 PM IST
కమల్‌హాసన్, సూర్య ( Suriya)
కమల్‌హాసన్, సూర్య ( Suriya)

కమల్‌హాసన్‌ హీరోగా చేస్తున్న  కొత్త సినిమా ‘విక్రమ్‌’. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ..పోలీస్‌ ఆఫీసర్‌‌గా ఫహాద్‌ ఫాజిల్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాపై మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. తమిళ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. సినిమా కథను మలుపుతిప్పే ముఖ్యమైన పాత్రలో సూర్య (Suriya) కనిపించనున్నారని…ఆయన క్యారెక్టర్‌ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌ అని లోకేష్ ఇటీవల చెప్పాడు.

ఇండియన్‌ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్.  ఏ పాత్ర చేసినా వైవిద్యం కోరుకునే నటుడాయన. కామెడీ, సీరియస్, సెంటిమెంట్‌ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి జీవించే నటుడిగా కమల్‌కు మంచి పేరుంది. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. కథ, కథాంశం పరంగా అవి బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడుతున్నా.. ఆ సినిమాల్లో కూడా కమల్‌ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

దశావతారం సినిమాలో పది పాత్రలు పోషించి మెప్పించిన కమల్.. విశ్వరూపం 1, 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా కమల్‌ చేస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమల్‌ చేస్తున్న సినిమాపై ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురుచూస్తారు అనడంలో ఏ సందేహం లేదు. ప్రస్తుతం కమల్‌ హాసన్ చేస్తున్న విక్రమ్‌ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్‌ వచ్చింది. సినిమా ట్రైలర్‌‌ను, ఆడియోను ఒకే రోజు లాంచ్ చేయబోతున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.

ఈనెల 15వ తేదీన విక్రమ్‌ సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్‌ చేసి అదే రోజు సాయంత్రం సినిమా ఆడియో లాంచ్‌ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్ధ కమల్‌ ఇంటర్నేషనల్ ఫిలింస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో ‘విక్రమ్‌’ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా, సూర్య (Suriya) కూడా తాను ఇటీవల నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!