బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ కాబోతోందా..? లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas)..!

Updated on Nov 26, 2022 02:56 PM IST
తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. ప్రభాస్ తో (Prabhas) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. ప్రభాస్ తో (Prabhas) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ మార్కెట్ ఉన్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఈ సినిమాలతో రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆ సినిమాల తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం డార్లింగ్ ఆశలన్నీ ‘ఆదిపురుష్’ (AdiPurush) సినిమాపైనే ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలను వాయిదా వేశారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇప్పుడు ఆల్రెడీ పలు భారీ సినిమాలు ఉన్నాయి. మరి వీటిలో కొన్ని షూటింగ్ స్టార్ట్ చేసుకున్నవి అలాగే స్టార్ట్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో లైనప్ కి తాజాగా ఓ సెన్సేషనల్ దర్శకుడు కూడా వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది.

తాజాగా కమల్ హాసన్ కు ‘విక్రమ్’ (Vikram Movie) సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డార్లింగ్ తో కలిసి ఆయన సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారట. దీంతో ఈ ఊహించని కాంబినేషన్ ఒక్కసారిగా ఇండియన్ సినిమా దగ్గర, ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తిగా మారిపోయింది.

అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాదు కానీ ఈ టాక్ అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపై అధికారిక అప్డేట్ ఏమైనా వస్తుందేమో అన్నది చూడాలి. మరోవైపు లోకేష్ తన తర్వాతి సినిమాను దళపతి విజయ్ తో సినిమా అనౌన్స్ చేయనున్నాడు. అలాగే ఆ తర్వాత “ఖైదీ 2” (Khaithi 2), “విక్రమ్ 2” (Vikram 2) చిత్రాలు తెరకెక్కించనున్నాడు.

Read More: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘విక్రమ్’ (Vikram) సినిమాకు అరుదైన అవకాశం..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!