కార్తీ (Karthi )నటించిన ‘సర్దార్‌’ (Sardar) గ్రాండ్ సక్సెస్.. డైరెక్టర్ కు ఖరీదైన కారు గిఫ్గ్ ఇచ్చిన నిర్మాత!

Updated on Nov 03, 2022 11:11 AM IST
'సర్దార్' (Sardar) సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ రావడంతో చిత్ర నిర్మాత.. డైరెక్టర్‌ కి ఖరీదైన టయోటా కారుని గిఫ్ట్ గా ఇచ్చారు.
'సర్దార్' (Sardar) సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ రావడంతో చిత్ర నిర్మాత.. డైరెక్టర్‌ కి ఖరీదైన టయోటా కారుని గిఫ్ట్ గా ఇచ్చారు.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) డ్యూయల్ రోల్ లో రాశీ ఖన్నా (Raashi Khanna), రజిషా విజయన్‌ హీరోయిన్లుగా దీపావళికి వచ్చిన సినిమా ‘సర్దార్‌’ (Sardar). ఈ థ్రిల్లింగ్ యాక్షన్ స్పై ఎంటర్టైనర్ మూవీ ని పీఎస్ మిత్రన్ తెరకెక్కించగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు.

స్పై థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ‘సర్దార్‌’ (Sardar) మూవీ అక్టోబర్ 21న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్‌తో ప్రదర్శించబడుతూ.. కార్తీకి మరో బ్లాక్ బస్టర్‌ హిట్టుగా నిలిచింది. ఈ ఏడాది ఈ యంగ్ హీరో వరుస విజయాలు అందుకుంటూ ఖుషీ అవుతున్నాడు. కాగా, 'సర్దార్' సినిమా కార్తి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. 

అయితే, ఇటీవలి కాలంలో సినిమా హిట్ అయితే డైరెక్టర్స్ కి హీరోలు లేదా నిర్మాతలు ఏదో ఒక ఖరీదైన గిఫ్టులు అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో ఇది కొనసాగుతోంది. తాజాగా 'సర్దార్' (Sardar) సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ రావడంతో చిత్ర నిర్మాత, ప్రిన్స్‌ పిక్చర్స్‌ అధినేత ఎస్‌. లక్ష్మణ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ కి ఖరీదైన టయోటా కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. హీరో కార్తీ చేతుల మీదుగా కారుని పీఎస్‌ మిత్రన్‌కు అందించాడు. ఈ కారు ధర దాదాపు రూ.30 లక్షలపైనే ఉంటుందని సమాచారం. కార్తీ పీఎస్‌ మిత్రన్‌ కి కారు కీ అందిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక, దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా ప్రకటించింది చిత్రయూనిట్. దానికి 'సర్దార్ 2' (Sardar 2) గా టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. 'సర్దార్'కి పని చేసినవారే ఈ రెండో పార్డ్ లోనూ భాగం కానుందని స్పష్టత ఇచ్చారు. ‘‘ఒక్కసారి గూఢచారి అయితే.. ఎప్పుడూ గూఢచారియే’’ అంటూ సర్దార్ కొడుకు పాత్ర రా ఏజెంట్ గా ఎంపికవ్వడాన్ని ప్రచారం చిత్రంలో చూపించారు. కార్తి సరసన రాశిఖన్నా నటించిన ఈ సినిమాలో చుంకీపాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్ కీలకపాత్రలు పోషించారు.

Read More: కార్తీ (Karthi) నటించిన 'సర్దార్' (Sardar) సినిమాకు సీక్వెల్.. త్వరలో షూటింగ్ ప్రారంభం.. నిర్మాతల కీలక నిర్ణయం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!