రిపీట్‌ కానున్న జై భీమ్‌ కాంబినేషన్‌ : జ్ఞానవేల్‌తో మరో సినిమాకు తమిళ హీరో సూర్య (Suriya) ఓకే చెప్పాడని టాక్

Updated on May 26, 2022 10:43 AM IST
తమిళ హీరో సూర్య (Suriya)
తమిళ హీరో సూర్య (Suriya)

తమిళ హీరో సూర్యకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా ‘జై భీమ్‌’. తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై ఈ సినిమాను సూర్య (Suriya) నిర్మించాడు. టీజే జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా పలు అవార్డులు కూడా ఈ సినిమాను వరించాయి.

దాదా సాహేబ్‌ పాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో రెండు అవార్డులు సాధించింది ‘జై భీమ్‌’.. ఉత్తమ చిత్రంగా ఓ అవార్డు, మూవీలో నటించిన మణికందన్‌కు బెస్ట్‌ సపోర్టింగ్ యాక్టర్‌గా మ‌రో అవార్డు దక్కింది అవి కాకుండా ‘జై భీమ్‌’ సినిమాకు మరో రెండు అవార్డులు కూడా వ‌చ్చాయి. ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో ఈ సినిమాను ప్రదర్శించారు.

ఈ సినిమాలో న‌టించిన లియోమోల్‌ జోస్‌కు  ఇండీ స్పిరిట్ బెస్ట్‌ యాక్ట్రెస్ అవార్డు వ‌చ్చింది. అలాగే  ఇండీ స్పిరిట్ బెస్ట్‌ సినిమాటోగ్రఫీ కూడా ‘జై భీమ్‌’ సొంతం చేసుకుంది. మూవీ కెమెరామెన్‌ ఎస్‌.ఆర్‌. కదీర్‌కు ఈ అవార్డు ద‌క్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘జై భీమ్‌’  చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

ఇక, ఇప్పుడు సూర్య, జ్ఞానవేల్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్టు సమాచారం. సూర్య కోసమే ప్రత్యేకంగా డైరెక్టర్ కథ రెడీ చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథను సూర్యకు వినిపించాడని, కథ నచ్చడంతో సినిమా చేయడానికి సూర్య (Suriya) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జై భీమ్‌.. మంచి టాక్‌ సొంతం చేసుకోవడంతో తర్వాత వచ్చే సినిమాపై అంచనాలు దాదాపు ఎక్కువగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా, ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!