VeeraSimhaReddy: ‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నటసింహం బాలకృష్ణ అభిమానులకు ఇక పూనకాలే..!

Updated on Dec 03, 2022 04:56 PM IST
VeeraSimhaReddy:‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్యను ఢీకొనే ప్రతినాయకుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నారు
VeeraSimhaReddy:‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్యను ఢీకొనే ప్రతినాయకుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నారు

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ (VeeraSimhaReddy). క్రేజీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ ఫిల్మ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ‘వీరసింహారెడ్డి’ దిగడం ఖాయమైంది. అయితే ఈ సినిమా ఏ రోజున థియేటర్లలోకి వస్తుందనే దానిపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. 

‘వీరసింహారెడ్డి’ రిలీజ్ డేట్ మీద వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే పండుగ బరిలో రెండు సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరో మూవీ రేసులో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికే రానుండగా.. దళపతి విజయ్ యాక్ట్ చేస్తున్న ‘వారసుడు’ కూడా ఫెస్టివల్‌కే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో పండుగకు బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ తప్పేలా లేదు. 

ఇకపోతే, వరుస పరాజయాలతో డీలాపడ్డ బాలకృష్ణ (Balakrishna).. ‘అఖండ’తో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. ఈ చిత్రం సక్సెస్ బాలయ్యలో జోష్ నింపింది. ‘అఖండ’ మూవీ తర్వాత ‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ షోతో దూసుకెళ్తున్నారు బాలయ్య. ఈ షోతో ఈతరం ప్రేక్షకుల్లోనూ ఆయనకు క్రేజ్ మరింత పెరిగింది. ఈ క్రేజ్‌ను ఇలాగే కొనసాగిస్తూ ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్‌ను ఆయన మొదలుపెట్టేశారు. 

కాగా, ‘అఖండ’ (Akhanda) సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఆయన కెరీర్‌లో ఇది 107 (NBK 107)వ చిత్రం కానుంది. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ యాక్ట్ చేస్తున్నారు. ఈ  సినిమాలో బాలయ్యను ఢీకొనే ప్రతినాయకుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నారు. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు.

‘వీరసింహారెడ్డి’ మూవీ నుంచి ఇటీవల ‘జై బాలయ్య’ మాస్ ఆంథెమ్‌ సాంగ్‌ రిలీజైంది. బాలయ్య అభిమానుల్లో జోష్ నింపేలా ఉన్న ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా.. ఖరీముల్లా ఆలపించారు. ‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు’ అంటూ సాగే ఈ పాటలో మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్‌, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలకృష్ణ లుక్‌ అదిరిపోయిందనే చెప్పాలి. మరి, ఈ మూవీతో బాలయ్య ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తారో చూడాలి. 

Read more: Fittest Tollywood Actresses : ఫిట్ నెస్ విషయంలో హీరోలతో పోటీ పడుతున్న టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!