Rajinikanth: ర‌జ‌నీకాంత్ షూటింగ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన 'భాగ్య‌న‌గ‌రం'

Updated on Jul 15, 2022 03:24 PM IST
Rajinikanth: హైద‌రాబాద్‌లో షూటింగ్ రజనీ కాంత్ సెంటిమెంట్‌గా భావిస్తున్నారా?.
Rajinikanth: హైద‌రాబాద్‌లో షూటింగ్ రజనీ కాంత్ సెంటిమెంట్‌గా భావిస్తున్నారా?.

Rajinikanth: సూపర్ స్టార్ రజనీ కాంత్ న‌టించే సినిమాల షూటింగ్స్ హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ప్ర‌తీ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లోనే జ‌రిగేలా ర‌జ‌నీ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ర‌జ‌నీకాంత్ న‌టించిబోయే నెక్ట్స్ మూవీ షూటింగ్ కూడా అక్క‌డే జ‌ర‌గ‌నుంద‌ట‌. హైద‌రాబాద్‌లో షూటింగ్ ర‌జ‌నీ సెంటిమెంట్‌గా భావిస్తున్నారా?.

త‌లైవా సెంటిమెంట్
తమిళ తలైవా రజనీకాంత్ (Rajinikanth) 169వ సినిమా త‌ర్వ‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ర‌జ‌నీ 169వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ త‌లైవా అభిమానులు ఆనంద ప‌రుస్తున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ర‌జ‌నీకాంత్ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం హైద‌రాబాద్‌లో జ‌రిపేలా ద‌ర్శ‌కుడు దిలీప్ ప్లాన్ చేశార‌ట‌. ర‌జ‌నీ కాంత్ కూడా ఓ సెంటిమెంట్‌గా భావిస్తున్నార‌ట‌.

హైద‌రాబాద్‌లో భారీ సెట్టింగులు
సినిమా షూటింగ్‌ల‌కు హైద‌రాబాద్ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. హైదరాబాద్‌లో షూటింగ్  కోసం ఇత‌ర భాష‌ల‌ హీరోలు, దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారట‌. హైదరాబాద్‌ సిటీ వాతావ‌ర‌ణం, సౌక‌ర్యాలు, ప్ర‌తీ ఆర్టిస్టు అందుబాటులో ఉండ‌టంతో.. అంద‌రూ భాగ్య‌న‌గ‌రానికి క్యూ క‌డుతున్నారు. అదీకాక ఈ మ‌ధ్య టాలీవుడ్ సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్‌ సాధిస్తున్నాయి. 


 

Rajinikanth: హైద‌రాబాద్‌లో షూటింగ్ రజనీ కాంత్ సెంటిమెంట్‌గా భావిస్తున్నారా?.

క్యూ క‌డుతున్న హీరోలు
Rajinikanth: తెలుగు సినిమాల కోసం ప‌లు స్టూడియోల్లో భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయాల‌తో అద్భుత‌మైన సెట్స్.. సినిమాల్లో వండ‌ర్‌గా అనిపిస్తున్నాయి. దీంతో హైద‌రాబాద్‌లో షూటింగులు ఎక్కువ‌గా జ‌రుపుతున్నారు. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో రజనీకాంత్ , నెల్సన్ దిలీప్ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. రజనీతో పాటు విజ‌య్, అజిత్, విశాల్ కూడా హైద‌రాబాద్‌కు వ‌స్తున్నార‌ట‌. వీళ్లే కాకుండా బాలీవుడ్ నుంచి సల్మాన్ లాంటి హీరోలు కూడా త‌మ సినిమా షూటింగ్‌ల‌కు కోసం హైదరాబాద్‌కు ఎక్కువ‌గా వ‌చ్చి వెళుతున్నార‌ట‌.

Read More: Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టాప్ 10 చిత్రాలు.. ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిందే !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!