Chandramukhi 2: చంద్రముఖి 2 మొద‌లు ! రాఘ‌వ లారెన్స్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ఆశీర్వాదం ఎందుకు తీసుకున్నారు?

Updated on Jul 16, 2022 01:26 PM IST
ర‌జ‌నీకాంత్ (Rajinikanth) కాళ్ల‌కు మొక్కి మ‌రీ రాఘ‌వ లారెన్స్ ఆశీర్వాదం తీసుకున్నారు.
ర‌జ‌నీకాంత్ (Rajinikanth) కాళ్ల‌కు మొక్కి మ‌రీ రాఘ‌వ లారెన్స్ ఆశీర్వాదం తీసుకున్నారు.

Chandramukhi 2: రజనీకాంత్, జ్యోతిక,నయనతార నటించిన నాటి 'చంద్రముఖి'కి సీక్వెల్‌గా.. 'చంద్ర‌ముఖి 2' చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తెర‌కెక్కిస్తున్నారు. 'చంద్ర‌ముఖి' సినిమాలో ర‌జ‌నీకాంత్ (Rajinikanth) త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ను, అభిమానులను ఉర్రూతలూగించారు.

ఇటీవలే రాఘ‌వ లారెన్స్ తన గురువు ర‌జ‌నీకాంత్ ఆశీర్వాదం తీసుకున్నారు. ర‌జ‌నీకాంత్ ఇంటికి వెళ్లి మ‌రీ ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రించారు.  అయితే 'చంద్ర‌ముఖి 2'లో ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్నారా? లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

'చంద్ర‌ముఖి 2'లో రాఘ‌వ లారెన్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా.. జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలలో హార్రర్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ చిత్రం త‌మిళ‌నాడులోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో కూడా సూప‌ర్ స‌క్సెస్‌గా నిలిచింది. పి. వాసు ద‌ర్శ‌క‌త్వంలో 2005లో 'చంద్ర‌ముఖి' చిత్రం రిలీజ్ అయింది.

శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన‌ ఈ చిత్రంలో రజనీకాంత్‌ సైకాలజిస్ట్ పాత్ర పోషించారు. నటుడు ప్రభుకి స్నేహితుడిగా చంద్రముఖి బంగ్లాకి వచ్చిన ఆయన, ఓ ఆత్మకు సంబంధించిన రహస్యాలను ఎలా చేధిస్తారన్నదే చిత్రకథ. ఓ కన్నడ చిత్రానికి రీమేక్ అయిన 'చంద్రముఖి' చిత్రం.. ఆ తర్వాత హిందీలో కూడా 'భూల్ భులయ్యా' పేరుతో రీమేక్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అందులో రజనీకాంత్ పోషించిన పాత్రను పోషించారు. 

ప్ర‌స్తుతం 'చంద్రముఖి'  చిత్రానికి సీక్వెల్‌గా 'చంద్ర‌ముఖి 2'ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్‌కు బ‌దులుగా రాఘ‌వ లారెన్స్ క‌నిపించ‌నున్నారు.ఇప్పటికే ముని, కాంచన, గంగ లాంటి హారర్ చిత్రాలతో ఆ జోనర్‌లో పాపులారిటీ సంపాదించుకున్న లారెన్స్ చేయబోయే మరో ప్రయోగమే ఈ 'చంద్రముఖి 2'. 

ర‌జ‌నీ ఆశీర్వాదంతో సినిమా  : రాఘ‌వ లారెన్స్
Chandramukhi 2: 'చంద్రముఖి 2' సినిమా షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైంది. అంతకు ముందే లారెన్స్ స్వయంగా  రజనీకాంత్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను రాఘ‌వ లారెన్స్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

Chandramukhi 2: చంద్రముఖి 2 సినిమాకు పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. శుభాస్కరన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

అలాగే తోటతరణిని ఆర్ట్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. క‌మెడియ‌న్ వడివేలు 'చంద్ర‌ముఖి 2' లో కూడా న‌వ్వులు పంచనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read More: Chandramukhi 2: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా 'చంద్రముఖి 2'.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!