ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ను క‌లిసిన చెస్ ఛాంపియ‌న్ ప్రజ్ఞానానంద

Updated on Jul 23, 2022 06:00 PM IST
చెస్ పోటీల‌కు చెన్నై వెళ్లిన ప్రజ్ఞానానంద ర‌జ‌నీకాంత్‌ను (Rajinikanth) క‌లిశారు.
చెస్ పోటీల‌కు చెన్నై వెళ్లిన ప్రజ్ఞానానంద ర‌జ‌నీకాంత్‌ను (Rajinikanth) క‌లిశారు.

భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానానంద సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ను క‌లిశాడు. ర‌జ‌నీకాంత్‌ను క‌లుసుకోవ‌డం వల్ల తనకు ఎంతో ఆనందం కలిగిందని ప్రజ్ఞానానంద తెలిపాడు. త‌న కుటుంబంతో క‌లిసి ర‌జ‌నీకాంత్‌ను క‌లిసిన ఫోటోల‌ను ప్రజ్ఞానానంద త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ర‌జ‌నీకాంత్ ప్రజ్ఞానానంద తన చెస్ కెరీర్‌లో మరింత ఉన్న‌త స్థానాల‌ను చేరుకోవాల‌ని ఆశీర్వ‌దించాడు. 

ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌ థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్  ఆర్. ప్రజ్ఞానానంద అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు అనుకోని షాకిచ్చాడు ఈ బుడతడు.  గేమ్‌లో ఎవరూ ఊహించని ప్రదర్శనను కనబరిచి ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు ఓటమి రుచి ఏంటో చూపించాడు.

ర‌జ‌నీ ఆశీర్వాదం తీసుకున్న ప్రజ్ఞానానంద
త‌మిళ‌నాడులో 44వ FIDE చెస్ ఒలింపియాడ్ పోటీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు చెన్నైలోని  మహాబలిపురంలో జూలై 28న మొద‌ల‌వుతాయి. చెస్ పోటీల‌ కోసం చెన్నై వెళ్లిన ప్రజ్ఞానానంద సూపర్ స్టార్  ర‌జ‌నీకాంత్‌ (Rajinikanth) ను క‌లిశాడు. త‌న కుటుంబంతో క‌లిసి ప్రజ్ఞానానంద ర‌జినీకాంత్‌ ఇంటికి వెళ్లారు. ర‌జినీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఈ బాల మేధావి చెస్ పోటీల‌కు హాజ‌ర‌య్యాడు.

Read More: Rajinikanth: ర‌జ‌నీకాంత్ షూటింగ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన 'భాగ్య‌న‌గ‌రం'

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!