Hit 2 Trailer: ఒళ్లు గగుర్పొడిచేలా సన్నివేశాలు.. ఆసక్తి రేపుతున్న అడివి శేష్ (Adivi Sesh) ‘హిట్ 2’ ట్రైలర్

Updated on Nov 23, 2022 12:04 PM IST
టీజర్‌లో ఫన్నీగా సాగిన శేష్ (Adivi Sesh) పాత్ర.. ట్రైలర్‌లో అందుకు భిన్నంగా ఫుల్ సీరియస్‌గా కనిపించారు
టీజర్‌లో ఫన్నీగా సాగిన శేష్ (Adivi Sesh) పాత్ర.. ట్రైలర్‌లో అందుకు భిన్నంగా ఫుల్ సీరియస్‌గా కనిపించారు

విభిన్న కథాంశాలను ఎన్నుకుంటూ కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు అడివి శేష్​ (Adivi Sesh). ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటూ అందులో కొత్తదనం ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. అందుకు తగ్గట్లే వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ శేష్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. 

ఇప్పుడు ‘హిట్ 2’ (Hit 2) చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రావడానికి అడివి శేష్ సిద్ధమవుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై, మంచి హిట్‌గా నిలిచిన ‘హిట్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. తొలి భాగంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. సెకండ్ పార్ట్‌లో శేష్ కథానాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. ‘హిట్ 1’ (Hit)కు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను.. సీక్వెల్‌కూ దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

డిసెంబర్ 2న భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ‘హిట్ 2’ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజైంది. టీజర్‌ను మించిపోయేలా ఈ ట్రైలర్ (Hit 2 Trailer)ను శైలేష్ కొలను కట్ చేశారని చెప్పొచ్చు. ఒకవైపు సినిమాలో ఎలా ఉండబోతోందనేది చెబుతూనే.. ప్రేక్షకులను భయపెట్టేందుకు డైరెక్టర్ ప్రయత్నించారు. హత్య కేసును ఇన్వెస్టిగేస్ చేసే పోలీసు అధికారిగా శేష్ ఇంటెన్స్‌గా కనిపించారు. టీజర్‌లో ఫన్నీగా సాగిన ఆయన పాత్ర.. ఇందులో మాత్రం సీరియస్‌గా కనిపించింది. మూవీపై ఆసక్తి పెంచడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. 

ఇకపోతే, ‘హిట్ 2’ చిత్రానికి జాన్ స్టివార్ట్ ఏడూరి బాణీలు సమకూర్చుతున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి త్రిపురనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఈ మూవీకి.. గ్యారీ బి.హెచ్ ఎడిటర్‌గా, ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో సీనియర్ నటులు పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్, రావు రమేశ్, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో పుల్ ఫామ్‌లో ఉన్న అడివి శేష్ ఈ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

Read more: Naga Chaitanya: అదిరిన అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ లుక్.. వెంకట్ ప్రభు ‘కస్టడీ’ (Custody)లో చైతూ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!