HIT The Second Case : అడ‌వి శేష్  (Adivi Sesh) న‌టిస్తున్న‌ 'హిట్ -  ద సెకెండ్ కేస్' చిత్రం టాప్ 10 విశేషాలు..

Updated on Oct 13, 2022 12:48 PM IST
HIT The Second Case : అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టిస్తున్న 'హిట్ - ద సెకెండ్ కేస్' సినిమా డిసెంబ‌ర్ 2 విడుద‌ల కానుంది.
HIT The Second Case : అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టిస్తున్న 'హిట్ - ద సెకెండ్ కేస్' సినిమా డిసెంబ‌ర్ 2 విడుద‌ల కానుంది.

HIT The Second Case : టాలీవుడ్ హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) 'మేజ‌ర్' సినిమా త‌రువాత 'హిట్ 2' లో న‌టిస్తున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని త‌న సొంత బ్యాన‌ర్‌లో నిర్మించిన 'హిట్' సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2' తెర‌కెక్కుతోంది. 'హిట్' సినిమాలో హీరోగా విశ్వ‌క్ సేన్ న‌టించారు. 'హిట్' సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించింది. ఈ నేప‌థ్యంలో 'హిట్' సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. 'హిట్ -  ద సెకెండ్ కేస్ సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన‌ టాప్ 10 విశేషాలు మీ కోసం. 

HIT The Second Case : అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టిస్తున్న 'హిట్ - ద సెకెండ్ కేస్' సినిమా డిసెంబ‌ర్ 2 విడుద‌ల కానుంది.

1. సీక్వెల్ సినిమా

'హిట్' సినిమా సీక్వెల్‌గా 'హిట్ - ద సెకెండ్ కేస్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హిట్' సినిమాలో హీరోగా విశ్వ‌క్ సేన్ న‌టించారు. ఈ సినిమాకు శైలేష్ కోనేరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. హీరో నాని నిర్మించారు. 'హిట్' సినిమా స‌క్సెస్ కావ‌డంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు. 

2. క‌థ‌ ఏంటి?

'హిట్ 2'  (HIT 2) సినిమా క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సాగే క‌థ‌గా తెర‌కెక్క‌నుంది. హీరో అడివి శేష్ ఇందులో కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో మెప్పించున్నారు. తెలంగాణ‌ పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని కె.డి ఎలా డీల్‌ చేశాడనేది క‌థ‌. ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్ ఇన్వెస్టిగేష‌న్‌తో 'హిట్ 2' సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

3. హీరోపై ఫోక‌స్

'మేజ‌ర్' సినిమాతో అడ‌వి శేష్ పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఫాలోయింగ్ పెంచుకున్నారు.  'గూఢ‌చారి' సినిమాను ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. 'హిట్ - ద సెకెండ్ కేస్' చిత్రంలో అడ‌వి శేష్ హీరోగా న‌టిస్తున్నారు. థ్రిల్ల‌ర్ సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో అడ‌వి శేష్ ముందే ఉంటారు. ఇక అడ‌వి శేష్ ఈ సినిమాలో త‌న న‌ట విశ్వ‌రూపం చూప‌నున్నారు. 

4. నిర్మాత హీరోనే

'హిట్' సినిమాను హీరో నాని నిర్మించారు. ఈ సినిమా సీక్వెల్ 'హిట్ -  ద సెకెండ్' చిత్రానికి కూడా నానినే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హీరోగా నాని సినిమాలు అనుకున్నంత స‌క్సెస్ సాధించ‌లేక‌పోతున్నాయి. నిర్మాత‌గా స‌క్సెస్ సాధిస్తారనే న‌మ్మ‌కంతో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

5. హీరోయిన్ ఎవ‌రంటే!

2018 ఫెమినా మిస్ ఇండియాగా గెలిచిన మీనాక్షి చౌద‌రి 'హిట్ 2' లో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. హీరో సుశాంత్ హీరోగా న‌టించిన 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' సినిమాతో మీనాక్షి చౌద‌రి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత ర‌వితేజ‌తో 'ఖిలాడీ' సినిమాలో అల‌రించారు. ప్ర‌స్తుతం అడ‌వి శేష్‌తో 'హిట్‌2' లో జోడిగా న‌టిస్తున్నారు. 

6. రిలీజ్‌పై ఉత్కంఠ‌

'హిట్ -  ద సెకెండ్ కేస్' సినిమాను డిసెంబ‌ర్ 2 తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు బాల‌కృష్ణ న‌టిస్తున్న 'ఎన్‌బీకే 107' కూడా డిసెంబ‌ర్ 2 తేదీన రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే అడ‌వి శేష్, బాల‌య్య‌ల సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. 

7. డైరెక్ష‌న్ గురించి

'హిట్' సినిమాతో శైలేష్ కొల‌ను డైరెక్ట‌ర్‌గా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. హిందీలోనూ హిట్ సినిమాను రీమేక్ చేసి హిట్ కొట్టారు. సీక్వెల్‌ను ఈ ద‌ర్శ‌కుడే చిత్రీక‌రిస్తున్నారు. 

8. మ్యూజిక్ 

హిందీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జాన్ స్టీవార్ట్ ఏడూరి సంగీతం అందిస్తున్నారు. 

9. ముందే రిలీజ్ అవ్వాల్సిన సినిమా

'హిట్ 2' సినిమా జూలై 29న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ 'మేజ‌ర్' సినిమా రిలీజ్ కావ‌డంతో ఈ సినిమా విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు. 'హిట్ 2' డిసెంబర్ 2 తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

10. న‌టీన‌టుల గురించి

రావు రమేశ్, భానుచందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Read More: HIT 2: 'హిట్ 2' రిలీజ్ తేదీ ఫిక్స్.. అడ‌వి శేష్ (Adivi Sesh) కొత్త లుక్‌లో అదుర్స్

Advertisement
Credits: Wikipedia

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!