యూట్యూబ్ నుంచి ‘హిట్ 2’ టీజర్ (HIT 2 Teaser) డిలీట్ చేసిన యాజమాన్యం.. క్లారిటీ ఇచ్చిన అడివి శేష్(Adivi Sesh)!

Updated on Nov 09, 2022 06:20 PM IST
ఇటీవల విడుదలైన 'హిట్ 2' టీజ‌ర్‌కి ('HIT 2' Teaser) సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 9 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది.
ఇటీవల విడుదలైన 'హిట్ 2' టీజ‌ర్‌కి ('HIT 2' Teaser) సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 9 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది.

'HIT 2' Teaser: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ లో ‘హిట్’ (Hit) సిరీస్ ఒకటి. విశ్వక్ సేన్ (Vishwaksen) హీరోగా రుహానీ శర్మ హీరోయిన్ గా శైలేష్ కొలను ఈ సినిమా తెరకెక్కించారు. నాచురల్ స్టార్ నాని సమర్పించిన ఈ సినిమాని ఆయన సోదరి త్రిపురనేని ప్రశాంతి నిర్మించారు. ఈ సినిమాకి సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే ప్రకటించింది చిత్ర యూనిట్.

'హిట్ సెకండ్ కేస్' (HIT 2)లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary), కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రావు రమేష్, భానుచందర్, శ్రీనాథ్ మాగంటి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన 'హిట్ 2' టీజ‌ర్‌కి ('HIT 2' Teaser) సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 9 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకోవ‌ట‌మే కాకుండా యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్‌గా నిలిచింది. అయితే యూట్యూబ్.. 'హిట్ 2' టీజ‌ర్‌ను డిలీట్ చేసి ఈ మూవీ టీమ్‌కి షాకిచ్చింది. దీంతో ఈ అంశం గురించి హీరో అడివి శేష్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు. 

‘‘మా డైరెక్టర్ శైలేష్ కొలను (Silesh Kolanu) టీజర్‌ను నాకు చూపించ‌గానే ఈరోజు వ‌స్తుంద‌ని అనుకున్నాను. అనుకున్న‌ట్లే జ‌రిగింది. యూట్యూబ్.. 'హిట్ 2' టీజ‌ర్‌ను ట్రెండింగ్ లిస్టు నుంచి తీసేయ‌ట‌మే కాకుండా ఏజ్ రిస్ట్రిక్ష‌న్ చేశారు. సైన్ ఇన్ చేసి 18 ఏళ్లు వ‌య‌సున్న వాళ్ల‌ని ప్రూవ్ చేసుకుంటే కానీ టీజ‌ర్‌ను చూడ‌లేరు. వ‌యొలెన్స్ క‌దా.. సినిమాకు అదే క‌రెక్ట్‌. పిల్ల‌లు చూడొద్ద‌ని మేం ట్వీట్స్‌లో పెట్టాం కూడా’’ అని అన్నారు. 

"అయితే ఈ హింస మధ్యలో కాస్త రొమాన్స్‌ కూడా ఉండాలన్న ఉద్దేశంతో 'ఉరికే ఉరికే' అనే సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటను గురువారం రిలీజ్‌ చేయబోతున్నాం" అని అడివి శేష్‌ (Adivi Sesh) ఆ వీడియోలో చెప్పారు.

Read More: 'HIT 2' Teaser: 'హిట్ 2' టీజర్ వచ్చేసింది.. మరోసారి థ్రిల్లర్ కథాంశంతో సందడి చేస్తున్న అడివి శేష్ (Adivi Sesh)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!