Hit 2: ‘ఉరికే ఉరికే’ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ!

Updated on Nov 09, 2022 10:43 AM IST
‘ఉరికే ఉరికే’ పాటలో అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మధ్య రొమాన్స్ ఆకట్టుకుంటోంది
‘ఉరికే ఉరికే’ పాటలో అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మధ్య రొమాన్స్ ఆకట్టుకుంటోంది

వరుస హిట్లతో దూకుడు మీదున్న హీరో అడివి శేష్ (Adivi Sesh)​ నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 2’ (Hit: The First Case). మంచి విజయాన్ని అందుకున్న ‘హిట్’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌ను డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనే.. సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ ఇందులో కేడీ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు జోడీగా ఆర్య అనే క్యారెక్టర్‌లో మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

గత వారం రిలీజైన ‘హిట్ 2’ (Hit: Second First Case) చిత్రం టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో అడివి శేష్​, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘ఉరికే ఉరికే’ (Urike Urike) అనే ఈ పాటను రచయిత కృష్ణకాంత్ రాశారు. ప్రముఖ గాయని ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. 

‘ఉరికే ఉరికే’ ఫుల్ సాంగ్‌ను నవంబర్ 10న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఫుల్ సాంగ్ ట్రీట్‌లా ఉండబోతోందని ప్రోమోను బట్టి తెలుస్తోంది. అందమైన విజువల్స్, అందుకు తగ్గట్లు శ్రావ్యమైన సంగీతంతో ఈ పాట ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయంలా కనిపిస్తోంది. సిద్ శ్రీరామ్ గొంతు వినడానికి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ స్టివార్ట్ ఏడూరి బాణీలు సమకూర్చుతున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి త్రిపురనేని ‘హిట్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బి.హెచ్ ఎడిటర్‌గా, ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్, రావు రమేశ్, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more: అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తోంది!.. అనారోగ్యంపై స్పందిస్తూ సమంత (Samantha Ruth Prabhu) కన్నీళ్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!