మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కీలకపాత్రతో రీఎంట్రీ ఇవ్వబోతున్న రేణు దేశాయ్!

Updated on Sep 18, 2022 08:12 PM IST
  ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఆశలు పెట్టుకున్నారు రవితేజ (RaviTeja)
ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఆశలు పెట్టుకున్నారు రవితేజ (RaviTeja)

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర హంగామా చేయలేకపోతున్నాయి. రవితేజ తాజాగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ సినిమాలు ప్రేక్షకులతోపాటు, రవితేజ అభిమానులను కూడా నిరాశపరిచాయి. దాంతో ఎలాగైనా ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు రవితేజ.

వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోంది. రవితేజ కెరీర్‌‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా.. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ ఆధారంగా రూపొందుతోంది.

  ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఆశలు పెట్టుకున్నారు రవితేజ (RaviTeja)

కథలో కీలకంగా..

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. క్యారెక్టర్‌‌కు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్, డిక్షన్‌, గెటప్‌ను మార్చుకున్నారు రవితేజ.

టైగర్‌‌ నాగేశ్వరరావు సినిమాలోని కీలక పాత్రలో నటి రేణు దేశాయ్ నటించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు రేణు. రేణు దేశాయ్ క్యారెక్టర్‌‌ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు కీలకమని తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ కానుంది. కొన్నాళ్ల క్రితం రిలీజైన టైటిల్‌ పోస్టర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ (RaviTeja) గెటప్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

Read More : టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రవితేజ (RaviTeja) డిఫరెంట్‌ లుక్‌తో అలరిస్తారంటున్న డైరెక్టర్‌‌ వంశీకృష్ణ (pinkvilla.com)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!