‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రవితేజ (RaviTeja) డిఫరెంట్‌ లుక్‌తో అలరిస్తారంటున్న డైరెక్టర్‌‌ వంశీకృష్ణ

Updated on Sep 06, 2022 03:05 PM IST
గజదొంగ టైగర్‌‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘టైగర్‌‌ నాగేశ్వరరావు’ సినిమాలో టైటిల్‌ రోల్ ప్లే చేస్తున్నారు రవితేజ(RaviTeja)
గజదొంగ టైగర్‌‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘టైగర్‌‌ నాగేశ్వరరావు’ సినిమాలో టైటిల్‌ రోల్ ప్లే చేస్తున్నారు రవితేజ(RaviTeja)

‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఫలితాలతో మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) నిరాశచెందారు. రవితేజతోపాటు ఆయన అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే పడిపోవడం పైకి లేవడం రవితేజకు కొత్తేం కాదు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని రవితేజ స్టార్ హీరోగా ఎదిగారు. అదే దూకుడుతో తర్వాత సినిమాపై ఫోకస్‌ పెట్టారు రవితేజ.

ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు మాస్‌ మహారాజా. రవితేజ నటిస్తున్న మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొద‌లుపెట్టిన చిత్ర యూనిట్ ప్రస్తుతం కీల‌క ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తోంది. ఇదిలా ఉంటే ద‌ర్శకుడు వంశీకృష్ణ టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి పలు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించారు.

గజదొంగ టైగర్‌‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘టైగర్‌‌ నాగేశ్వరరావు’ సినిమాలో టైటిల్‌ రోల్ ప్లే చేస్తున్నారు రవితేజ(RaviTeja)

గజదొంగ బయోపిక్‌గా..

‘టైగ‌ర్ నాగేశ్వర‌రావు’ సినిమా ర‌వితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా తెర‌కెక్కుతోంది. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివరీ, న‌డ‌క, గెట‌ప్ అన్నీ భిన్నంగా ఉంటాయి’ అని చెప్పారు వంశీకృష్ణ. ఈ స్టేట్‌మెంట్స్‌తో రవితేజ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కతోంది. 70, 80 ద‌శ‌కాల్లో నాగేశ్వర‌రావు ఆంధ్రప్రదేశ్‌లో భారీ దొంగ‌త‌నాలు, దోపిడీలు చేస్తూ పోలీసుల‌కు దొరకకుండా త‌ప్పించుకునేవాడు. ఇలాంటి గ‌జ‌దొంగ క‌థ బ‌యోపిక్‌గా తెర‌కెక్కుతుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. రవితేజ (RaviTeja) నటిస్తున్న ‘టైగర్‌‌ నాగేశ్వరరావు’ సినిమా తెలుగుతోపాటు తమిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్నడ భాష‌ల్లో వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Read More : Ramarao On Duty Review : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) జనాలను మెప్పించాడా ? లేదా ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!