మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్!

Updated on Sep 17, 2022 05:04 PM IST
మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు
మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు

మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) ప్రస్తుతం శరవేగంగా సినిమాలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ముందు రవితేజ నటించిన ఖిలాడి సినిమా కూడా నిరాశపరిచింది. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నారు మాస్‌ మహారాజా. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అనుపమా పరమేశ్వరన్. ఆ సినిమాలో తన క్యూట్‌ లుక్స్, నటనతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. నితిన్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ సినిమా తెలుగులో అనుపమ నటించిన మొదటి సినిమా. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో అనుపమకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. కార్తికేయ2 విజయం దేశవ్యాప్తంగా అనుపమకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు

హాలీవుడ్‌ సినిమా ఆధారంగా..

ఇక, రవితేజ హీరోగా ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమాకు ‘ఈగల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. అక్టోబర్‌‌ నుంచి సినిమా రెగ్యులర్‌‌ షూటింగ్‌ మొదలుకానుంది.

హాలీవుడ్‌ సినిమా ‘జాన్‌విక్‌’ ఆధారంగా ఈ చిత్రానికి కథను రెడీ చేశారని సమాచారం. ఈగల్‌ సినిమాలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ ఎంపికైనట్టు తెలుస్తోంది. పీపుల్స్‌ మీడియా బ్యానర్‌‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈగల్ సినిమాను నిర్మించనున్నారు. రవితేజ (RaviTeja) ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు.

Read More : Tiger Nageswara Rao : రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో.. అనుపమ్ ఖేర్‌కు కీలక పాత్ర !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!