రవితేజ (Raviteja) లేటేస్ట్ మూవీ ‘ధమాకా’ (Dhamaka) నుంచి “దండకడియాల్” (Danda kadiyal) ప్రోమో సాంగ్‌ రిలీజ్..!

Updated on Dec 06, 2022 03:04 PM IST
తాజాగా ‘ధమాకా’ (Dhamaka) సినిమా నుంచి “దండకడియాల్” (Danda kadiyal) అంటూ సాగే ప్రోమో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.
తాజాగా ‘ధమాకా’ (Dhamaka) సినిమా నుంచి “దండకడియాల్” (Danda kadiyal) అంటూ సాగే ప్రోమో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘ధమాకా’ (Dhamaka). ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల (Sree leela) కథానాయికగా నటిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ (Dhamaka Movie) ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ మేరకు తాజాగా “దండకడియాల్” (Danda kadiyal) అంటూ సాగే ప్రోమో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ఈ ‘దండ కడియాల్’ పాటని సాహితీ, మంగ్లీతో కలిసి పాడడమే కాకుండా లిరిక్స్ కూడా రాయడం విశేషం. మంచి రిచ్ విజువల్స్ తో ఈ సాంగ్ ఉండేలా కూడా అనిపిస్తుంది. ఇక ఈ ట్యూన్ కూడా మంచి హమ్మింగ్ చేసే విధంగా ఉంది. 

మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకు రానున్న ‘ధమాకా’ (Dhamaka) సినిమాను రవితేజ ముందెన్నడూ లేనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. చిత్ర యూనిట్ అంతా షోస్, ఈవెంట్స్ కి వెళ్తుంటే.. ఎప్పుడూ ప్రీరిలీజ్ ఈవెంట్ లో, కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ లో మాత్రమే మాట్లాడే రవితేజ ఈ సారి ‘ధమాకా’ సినిమాని ముందుండి ప్రమోట్ చేస్తున్నాడు. నెల రోజుల ముందు నుంచే రవితేజ ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఇదే మొదటి సారి. మరి మూవీ మాస్ మహారాజ్ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. 

భీమ్స్‌ సిసిరోలయో (Bheems Ceciroleo) మాట్లాడుతూ… ‘రవితేజతో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం తర్వాత నేను మ్యూజిక్‌ చేసిన సినిమా ఇదే. ఆయనను చూస్తేనే పాటకు ఇన్సిపిరేషన్‌ వస్తుంది. మా గత సినిమా కంటే ఇది పెద్ద మ్యూజికల్‌ హిట్‌ అవుతుంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటిదాకా రిలీజ్‌ చేసిన జింతాక్‌, వాట్స్‌ హ్యాపెనింగ్‌, మాస్‌ రాజా, డు..డు..పాటలకు రెస్పాన్స్‌ బాగుంది’ అని అన్నారు.

Read More: రవితేజ (Raviteja) లేటెస్ట్ సినిమా నుంచి 'ధమాకా మాస్ క్రాకర్' (Dhamaka Mass Cracker) పేరుతో మాస్ టీజర్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!