ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ సినిమాకి కాన్సెప్ట్‌ ఆర్ట్‌ డిజైన్ చేసిన అభిమాని.. నెట్టింట ఫోటో వైరల్ !

Updated on Aug 29, 2022 02:25 PM IST
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో క్రితి సనన్ సీత పాత్రలో నటించడం విశేషం
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో క్రితి సనన్ సీత పాత్రలో నటించడం విశేషం

‘బాహుబలి’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్ (Prabhas). అప్పటి నుంచి ఆయనకు అన్నీ పాన్ ఇండియా సినిమా అవకాశాలే వస్తున్నాయి. అయితే ‘బాహుబలి’ రేంజ్ హిట్‌ మాత్రం ఆయన ఖాతాలో మరొకటి పడలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా ప్రభాస్ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. 

ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్ వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'ఆదిపురుష్' కూడా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఒక్కటి కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. 'ఆదిపురుష్‌' సినిమా షూటింగ్ పూర్తై నెలలు గడుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ కూడా ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేయలేదు.

అసహనంలో అభిమానులు..
ప్రభాస్‌ (Prabhas) కీలకపాత్రలో నటించిన 'ఆదిపురుష్‌'లో ఆయన లుక్‌ ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను గ్రాండియర్‌‌గా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హాలీవుడ్ టెక్నీషియన్లతో కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్‌ చేయిస్తున్నారని, అద్భుతమైన అవుట్‌పుట్ తీసుకువచ్చేందుకు వారు కష్టపడుతున్నారని వెల్లడించారు మేకర్స్.
 
తాజాగా ప్రభాస్ (Prabhas) అభిమాని ఒక‌రు 'ఆదిపురుష్ (Adipurush)' కాన్సెప్ట్ ఆర్ట్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆ ఆర్ట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. రాముడి లుక్‌లో ప్రభాస్ గంభీరంగా చూస్తున్న ఆర్ట్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.  

'ఆదిపురుష్ (Adipurush)' చిత్ర యూనిట్ నుంచి  సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు రాక‌పోయినా ప్రభాస్ అభిమానులు మాత్రం ఇలా పోస్టర్లు డిజైన్ చేసుకుంటూ సినిమాపై తమకు ఉన్న ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

కాగా సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో 'ఆదిపురుష్ (Adipurush)' సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కానుంద‌ని టాక్‌. మైథ‌లాజిక‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ద‌ర్శకుడు ఓం రౌత్.. రామాయ‌ణం నేప‌థ్యంలో తెరకెక్కించారు. రాముడి క్యారెక్టర్‌‌లో ప్రభాస్‌ నటించగా.. కృతిసనన్‌ సీత పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తున్నారు. 

'ఆదిపురుష్‌' సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌' సినిమాను దాదాపు 20 భాష‌ల్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా మేక‌ర్స్ రూపొందిస్తున్నార‌ని సమాచారం.

Read More : సలార్ (Salaar) : హాలీవుడ్‌ రేంజ్‌లో ప్రీ క్లైమాక్స్‌కి సిద్ధమైన ప్రభాస్ సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!