Shruti Haasan: 'ప్రశాంత్ నీల్ మరో ప్రపంచాన్ని సృష్టిస్తారు'.. సలార్ హీరో, దర్శకుడిపై శృతి హాసన్ వ్యాఖ్యలు!

Updated on Jul 03, 2022 09:27 PM IST
ప్రభాస్, శృతి హాసన్, ప్రశాంత్ నీల్ (Prabhas, Shruthi Haasan, Prashant Neel)
ప్రభాస్, శృతి హాసన్, ప్రశాంత్ నీల్ (Prabhas, Shruthi Haasan, Prashant Neel)

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అందం, అభినయంతో హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది శృతి హాసన్ (Shruti Haasan). తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్లామరస్ రోల్స్ తో పోలిస్తే అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు శృతి హాసన్. అందుకు తగ్గట్లుగానే ఆమె వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి. 

కమ్ బ్యాక్ తర్వాత రవితేజకి జంటగా చేసిన క్రాక్ (Krack Movie) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క్రాక్ మూవీకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని ఆమెకు బాలయ్య చిత్రంలో అవకాశం ఇచ్చాడు. బాలయ్య 107వ చిత్రంలో శృతి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు బేబీ తెరకెక్కిస్తున్న మెగా 154 మూవీలో చిరంజీవితో శృతి జతకడుతున్నారు. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. 

మరోవైపు.. ప్రభాస్-ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కాంబినేషన్ సలార్ మూవీ తెరకెక్కుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2023లో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇందులో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ కి సరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ ని ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దుతున్నారు. సలార్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఇటీవలే ప్రారంభమైంది. సలార్ (Salaar) మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

తాజాగా శృతి హాసన్ (Shruti Haasan) ప్రభాస్, ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలను ఇష్టపడుతూ ఉంటానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ మరో ప్రపంచంను సృష్టిస్తారని శృతి హాసన్ కామెంట్లు చేశారు. ప్రశాంత్ నీల్ సినిమాలో తాను నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి పని చేయడం చాలా బాగుందని ఆమె కామెంట్లు చేశారు.ప్రభాస్ అద్భుతం అని శృతి హాసన్ ప్రశంసలతో ముంచెత్తారు. 

Read More: Shruti Haasan: ప్రియుడు శాంతను హజారికా (Shantanu Hazarika)తో పెళ్లిపై ఆసక్తికర సమాధానమిచ్చిన శృతి హాసన్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!