Salaar : ప్ర‌భాస్ (Prabhas) సినిమాలో విల‌న్‌గా న‌టించ‌నున్న‌ 'మ‌ల‌యాళ హీరో'

Updated on Jul 24, 2022 04:20 PM IST
ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న 'స‌లార్' సినిమా షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.
ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న 'స‌లార్' సినిమా షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

Salaar : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) తెర‌కెక్కిస్తున్న చిత్రం 'స‌లార్'. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కానుంది. ఫుల్ యాక్ష‌న్ మూవీగా ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్' సినిమాను రూపొందిస్తున్నారు. 'స‌లార్‌'లో విల‌న్‌గా ఓ మ‌ల‌యాళ హీరో న‌టిస్తున్నార‌ట‌. ప్ర‌భాస్‌కు విల‌న్‌కు మ‌ధ్య జ‌రిగే ఫైట్స్‌ను ప్ర‌శాంత్ నీల్ ఓ రేంజ్‌లో వెండితెర‌పై చూపిస్తార‌ట‌. 

స‌లార్‌లో విల‌న్ ఎవ‌రంటే..

'స‌లార్' చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 'స‌లార్' సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ సీన్లు చిత్రీక‌రించ‌నున్నారు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల మ‌ధ్య ఉండే సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయ‌ట‌. ప్ర‌శాంత్ నీల్ వీరిద్ద‌రి మ‌ధ్య ఫైట్ సీన్ల‌ను భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 'స‌లార్' సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విల‌నిజం బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. 

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న'స‌లార్' సినిమా షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

యాక్ష‌న్ సీన్లపై ప్ర‌శాంత్ నీల్ ఫోక‌స్

'స‌లార్' చిత్రంలో విలన్ పాత్ర పోషించనున్న మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్ లోనే 'సలార్' సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. త్వ‌ర‌లో 'స‌లార్' షూటింగ్ కొత్త‌ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రభాస్  (Prabhas) ప్ర‌స్తుతం 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే 'స‌లార్' సినిమాలో యాక్ష‌న్ సీన్ల‌లో న‌టించ‌నున్నారు. ఓ లోతైన లోయ‌లో 'స‌లార్' ఫైట్ సీన్లను షూట్ చేయ‌నున్నార‌ట‌. 

తెలుగు సినిమాల్లో పృథ్వీరాజ్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలుగు సినిమాల్లో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పృథ్వీరాజ్ న‌టించిన 'అప్పనుమ్ కోషియమ్' చిత్రం తెలుగులో 'భీమ్లా నాయ‌క్‌'గా రిలీజ్ అయింది. అలాగే ఈ హీరో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'లూసీఫ‌ర్' చిత్రం తెలుగులో 'గాడ్ ఫాద‌ర్‌'గా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. 

హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరంగ‌న్‌దూర్ స‌లార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ (Shruthi Haasan) ప్ర‌భాస్‌కు జోడిగా న‌టిస్తుంది. 'స‌లార్' చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల‌తో నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నే సంగీతం అందిస్తున్నారు.

Read More : Salaar : 'డార్లింగ్' ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న‌.. స‌లార్ టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడంటే ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!