Shruti Haasan: ప్రియుడు శాంతను హజారికా (Shantanu Hazarika)తో పెళ్లిపై ఆసక్తికర సమాధానమిచ్చిన శృతి హాసన్..!

Updated on Jul 02, 2022 06:34 PM IST
ప్రియుడు శాంతను హజారికాతో శృతి హాసన్ (Shruti Haasan with  her Boyfriend Santanu Hazarika)
ప్రియుడు శాంతను హజారికాతో శృతి హాసన్ (Shruti Haasan with her Boyfriend Santanu Hazarika)

Shruti Haasan: కమల్ హాసన్ కుమార్తె గా సినీ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి తన నటన, అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న నటి 'శృతి హాసన్'. టాలీవుడ్ లోకి తొలిసారిగా హీరో సిద్దార్థ్ సరసన 'అనగనగా ఒక ధీరుడు' మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, బలుపు, ఇలా అనేక సినిమాలతో వరుసగా మంచి సక్సెస్ లు అందుకుంది శృతి హాసన్. ఇక ఇటీవల ఒకింత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఈ బ్యూటీ. 

శృతి హాసన్ (Shruti Haasan) ప్రస్తుతం బిజీ హీరోయిన్‌. వరుసగా ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్ లున్నాయి. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన ప్యాషన్‌పై వర్క్ చేస్తుంటుంది. సంగీతం, మ్యూజిక్‌పై దృష్టిపెడుతూ తన పర్సనల్‌ డిజైర్‌ని నెరవేర్చుకుంటుంది. తండ్రి కమల్‌ హాసన్‌కి తగ్గ తనయగా మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తుంది. గతేడాది ఏడాదికిపైనే ఆమె ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికా (Shantanu Hazarika)తో ఆమె డేటింగ్‌ చేస్తోంది. ఇద్దరూ ఎక్కడికైనా కలిసే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. బహిరంగంగానే తమ ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. 

ప్రియుడు శాంతను హజారికా, చెల్లి తో శృతి హాసన్ (Shruti Haasan with  her Boyfriend Santanu Hazarika and sister)

శృతి హాసన్ (Shruti Haasan) ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె సినిమా కెరీర్ తో పాటు పెళ్లి గురించి సదరు జర్నలిస్ట్ ప్రస్తావిస్తూ, ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు, దానికి నా దగ్గర బదులు లేదు అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు శృతి.

అయితే.. శృతి హాసన్, శాంతను ఇద్దరూ కలిసే ఉంటున్న నేపథ్యంలో పెళ్లిపై ఆమె క్లారిటీ ఇవ్వకపోవడం ఆలోచింపచేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఈ డేటింగ్లు, సహజీవనం అని, పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. (Santanu Hazarika) శాంతనుతో ప్రేమలో పడటానికి ముందే శృతి లవ్‌లో పడింది. బ్రిటీష్‌ నటుడు మైకేల్‌ కోర్సలేతో ప్రేమలో పడింది. కాకపోతే కొన్నాళ్లకు బ్రేకప్‌ చెప్పారు. ఆయనతో బ్రేకప్‌ చెప్పిన కొన్ని రోజులు సింగిల్‌గా ఉన్న శృతి .. ఆ తర్వాత రెండేళ్ల క్రితం నుంచి శాంతను ప్రేమలో ఉంది. 

శృతి హాసన్ (Shruti Haasan) సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌' , నటసింహం బాలకృష్ణ సరసన #NBK107, 'మెగా154' (వాల్తేరు వీరయ్య) సినిమాల్లో నటిస్తున్నారు.

Read More: Nandamuri Balakrishna: NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్.. 'సింహం వేటకు సిద్ధం'.. అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!