కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ?.. ఆలోచనలో పడేస్తున్న కొత్త ఫొటోలు!

Updated on Oct 27, 2022 02:27 PM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని గాసిప్స్ వస్తున్నాయి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని గాసిప్స్ వస్తున్నాయి

సినీతారలు అందంగా కనిపించడం కోసం చాలా శ్రమిస్తుంటారు. మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సౌందర్యాన్ని కాపాడుకుంటారు. మరింత అందంగా కనిపించడం కోసం కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీలను కూడా ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో ముక్కూ, మొహాలు మార్చుకోవడమూ సర్వసాధారణమే. అయితే ఆపరేషన్ల విషయంలో నటులు వీటినీ ధృవీకరించరనేది కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని అటుంచితే.. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ విషయంలోనూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని గాసిప్స్ వస్తున్నాయి. 

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఆమె ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు కంటే కాజల్ ముఖం కాస్త బొద్దుగా మారడంతోపాటు పెదాలు కూడా లావుగా కనిపిస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. దీనికి సర్జరీనే కారణమని అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 

కాజల్ (Kajal Aggarwal) ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమధ్య కాజల్ అగర్వాల్ పెడుతున్న ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆమెలో గతంలో ఉన్న స్పార్క్ లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఆమె మునుపటి కంటే అందంగా ఉందని.. త్వరలో సినిమాల్లో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. 

‘మగధీర’ సినిమా సమయంలోనూ కాజల్ విషయంలో ఇలాగే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘టెంపర్’ మూవీ టైమ్‌లోనూ బరువు తగ్గే ప్రయత్నం చేసిందని కామెంట్లు వచ్చాయి. మరి, వీటిల్లో నిజమెంతో కాజల్‌కే తెలియాలి. ఇకపోతే, రీఎంట్రీ కోసం కాజల్ కసరత్తులు చేస్తున్నారు. బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యేందుకు ‘కలరియపట్టు’ లాంటి ప్రాచీన యుద్ధకళను కాజల్ సాధన చేస్తున్నారు. ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించే ఆఫర్‌ను కాజల్ దక్కించుకున్నారని సమాచారం. తెలుగులో కూడా పలు స్క్రిప్టులను ఆమె వింటున్నారని తెలుస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తున్న ‘భారతీయుడు’ సీక్వెల్ షూటింగ్ తర్వలో మొదలవుతుందని అంటున్నారు. మరి, ఏ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తారో చూడాలి.  

Read more: మూడు వారాల్లో రిలీజ్ చేస్తే సాలిడ్ రేట్!.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiya)కు ఓటీటీ సంస్థ భారీ ఆఫర్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!