మూడు వారాల్లో రిలీజ్ చేస్తే సాలిడ్ రేట్!.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiya)కు ఓటీటీ సంస్థ భారీ ఆఫర్?

Updated on Oct 27, 2022 11:07 AM IST
మూడు వారాల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తే మరింత మొత్తాన్ని ఇస్తామని ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiya) మేకర్స్‌కు ఆఫర్ వచ్చిందని సమాచారం. 
మూడు వారాల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తే మరింత మొత్తాన్ని ఇస్తామని ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiya) మేకర్స్‌కు ఆఫర్ వచ్చిందని సమాచారం. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) దసరా పండుగకు రిలీజై మంచి విజయం సాధించింది. మెగాస్టార్ అభిమానులకు ఈ సినిమా ఫీస్ట్‌గా నిలిచింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ దగ్గర చిరు సత్తా చాటింది. అయితే స్టడీ రన్‌ను కొనసాగించడంలో మాత్రం విఫలమైంది. దీంతో మేకర్స్ అనుకున్నంత కలెక్షన్లు మాత్రం రాలేదు. కమ్ బ్యాక్‌లో మెగాస్టార్ చేసిన మూవీల్లో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది ‘గాడ్ ఫాదర్’కే. కానీ చిరు స్టామినాకు తగ్గ వసూళ్లను సాధించడంలో ఈ మూవీ విఫలమైంది. 

చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiya) సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం టైటిల్ టీజర్ దీపావళికి రిలీజైంది. యూట్యూబ్‌లో ఇప్పుడీ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. మాస్ లుక్‌లో చిరు స్టైలిష్‌గా చెప్పిన డైలాగ్స్‌తో ‘వాల్తేరు వీరయ్య’పై అంచనాలు ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’, కోలీవుడ్ దళపతి విజయ్ ‘వారసుడు’, అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’తో సంక్రాంతి రేసులో పోటీ పడేందుకు చిరు సిద్ధమవుతున్నారు. 

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ‘వాల్తేరు వీరయ్య’ను బాబీ రూపొందిస్తున్నట్లు టైటిల్ టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. చిరు అభిమానులు ఆయన నుంచి కోరుకునే వినోదాన్ని కమర్షియల్ అంశాలతో మేళవించి ఈ చిత్రాన్ని బాబి తెరకెక్కిస్తున్నారట. చిరుకు సరైన సినిమా పడితే బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొట్టడం ఖాయం. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రైట్స్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట. ఈ మూవీ మేకర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ ఓ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజైన మూడు వారాల్లోగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే విధంగా డీల్ సెట్ చేసుకుంటే.. అనుకున్న ధర కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తామని నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. మరి, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది మూవీ మేకర్స్‌కే తెలియాలి. ఇకపోతే, ‘వాల్తేరు వీరయ్య’లో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.

Read more: చిరు (Chiranjeevi Konidela) సినిమా వెయ్యి కోట్లు రాబట్టాలి.. అదే ఆయన ఇమేజ్‌కు తగిన చిత్రం: తమ్మారెడ్డి భరద్వాజ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!