‘చంద్రముఖి’ (Chandramukhi) సీక్వెల్ లో చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)..?

Updated on Oct 15, 2022 03:55 PM IST
కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal).. 'చంద్రముఖి' (Chandramukhi) సీక్వెల్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిసింది.
కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal).. 'చంద్రముఖి' (Chandramukhi) సీక్వెల్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిసింది.

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జ్యోతిక, ప్రభు, నయనతార కీలకమైన పాత్రలను పోషించిన ఆ సినిమాను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఈ సినిమా దక్షిణాది బాక్సాఫీస్‌ బరిలో పలు రికార్డులను క్రియేట్‌ చేసింది.

అప్పట్లో 'చంద్రముఖి' (Chandramukhi Sequel) సినిమాకి సీక్వెల్ చేయాలని దర్శకుడు పి. వాసు ప్రయత్నించినప్పటికీ, అందుకు రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ప్రస్తుతం ప్రముఖ డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా ఈ సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమయింది. ఇటీవలే 'చంద్రముఖి 2' టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి షూటింగును మొదలుపెట్టారు. 

ఈ సందర్భంగా ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని చెబుతూ, వారిలో టైటిల్ క్యారెక్టర్ 'చంద్రముఖి' ఎవరనే ఆసక్తిని రేకెత్తించారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'చంద్రముఖి-2' సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)కి ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చందమామ చంద్రముఖి పాత్రలో కనిపించనుందట. అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు.

సీక్వెల్‌లో కథ, కథనాలు ఎక్కువగా నాయిక పాత్ర చుట్టే సాగుతాయని, అభినయపరంగా కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) సీక్వెల్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిసింది. దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత కాజల్‌ సెట్స్‌మీద అడుగుపెట్టబోతోంది. కాగా ప్రస్తుతం ఈ భామ ఇప్పటికే.. ఇండియన్ 2 సినిమా కోసం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.  

ఎమ్ఎమ్ కీరవాణి 'చంద్రముఖి 2' (Chandramukhi 2) సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మొదటి పార్ట్ కు మించి అన్నట్టుగా ఉంటుందా లేదా అనేది చూడాలి. 

Read More: Chandramukhi 2 Update: ‘చంద్ర‌ముఖి 2’ నుంచి క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!