ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. అయితే తప్పేంటి?: శ్రుతి హాసన్ (Shruti Haasan)

Updated on Oct 15, 2022 03:39 PM IST
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోల జాబితా గురించి ఎందుకు రాయరంటూ శ్రుతి హాసన్ (Shruti Haasan) ప్రశ్నించారు 
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోల జాబితా గురించి ఎందుకు రాయరంటూ శ్రుతి హాసన్ (Shruti Haasan) ప్రశ్నించారు 

సినిమా తారలు అందంగా కనిపించడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ముక్కూ, మొహాలు మార్చుకోవడమూ కామనే. కొన్ని దశాబ్దాల కిందే ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. అందంగా మారడానికి ఆపరేషన్లు చేయించుకోవడానికీ వారు వెనకాడరని మీడియాలో గాసిప్స్ రావడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఆపరేషన్ల విషయంలో ఎవరూ వీటినీ ధృవీకరించే వారు కాదు. కానీ ఈమధ్య ఇలా ముఖాకృతులను మార్చుకోవడానికి సర్జరీలను ఆశ్రయించడం మామూలుగా మారింది. 

ముఖ్యంగా స్టార్ నటుల వారసులు ఇండస్ట్రీలో తమ స్థానం పదిలపర్చుకోవడం కోసం సర్జరీలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారని వినికిడి. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. అందుకే వీటిపై పెద్దగా గాసిప్స్ రావడం లేదు. ఒకవేళ వచ్చినా అందరూ వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే హీరోలే దీనికి మినహాయింపులా కనిపిస్తోంది. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించి హీరోలపై వచ్చే కథనాలు తక్కువే. అదే హీరోయిన్ల విషయంలో మాత్రం సర్జరీలు చేయించుకుంటే లెక్కలేనన్ని కథనాలు వస్తున్నాయి. 

ఉదాహరణకు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) విషయమే తీసుకుంటే.. ఆమె ముక్కు సర్జరీ విషయంపై మీడియాలో గతంలో చాలా స్టోరీలు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి వాటితో అలసిపోయిందేమో గానీ.. ఆపరేషన్ విషయాన్ని ప్రస్తావిస్తే శృతి ఘాటుగా స్పందిస్తున్నారు. ‘నా ముక్కు నా ఇష్టం, నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నన్ను మరింత అందంగా మార్చుకునేందుకు ఇలా చేయించుకుంటే.. మీకు సమస్య ఏంటి’ అంటూ శృతి ఎదురు ప్రశ్నిస్తున్నారు. 

కెరీర్ ఆరంభంలోనే శృతి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆపరేషన్ చేయించుకున్న స్టార్ల జాబితాలో ఆమె పేరును చాలా మంది ప్రస్తావిస్తుంటారు. దీనిపై శృతి ఫైర్ అవుతున్నారు. ‘సర్జరీలు చేయించుకున్న హీరోల లిస్టు గురించి ఎవ్వరూ రాయరు. హీరోయిన్లను మాత్రం నిత్యం టార్గెట్ చేస్తుంటారు. దీన్ని నేను ఖండించడం లేదు. కానీ నా ఫేస్, నా ఇష్టం’ అని శృతి గట్టిగా బదులిస్తున్నారు.

Read more: శృతి హాసన్ (Shruti Haasan) ఒక్కో సినిమాకు అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా? ఇవ్వడానికి రెడీగా నిర్మాతలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!