జేమ్స్ బాండ్ పాత్ర‌కు రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) సెట్ అవుతారట! హాలీవుడ్ ప్రముఖుడి ప్రశంసల వెల్లువ !

Updated on Jul 29, 2022 07:13 PM IST
రామ్ చ‌ర‌ణ్‌  (Ram Charan) ను జేమ్స్ బాండ్ చిత్రాల‌తో స్టార్ న‌టుడిగా గుర్తింపు పొందిన  డానియల్ క్రేగ్‌తో పోలుస్తూ చియో ట్వీట్ చేశారు. 
రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan) ను జేమ్స్ బాండ్ చిత్రాల‌తో స్టార్ న‌టుడిగా గుర్తింపు పొందిన డానియల్ క్రేగ్‌తో పోలుస్తూ చియో ట్వీట్ చేశారు. 

హాలీవుడ్ న‌టుడు డానియ‌ల్ క్రేగ్ జేమ్స్ బాండ్ చిత్రాల‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డానియ‌ల్ క్రేగ్  సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డానియ‌ల్ క్రేగ్ త‌ర్వాత జేమ్స్ బాండ్ పాత్ర‌లలో రాణించగల సత్తా టాలీవుడ్ న‌టుడు రామ్ చ‌ర‌ణ్‌కు (Ram Charan) ఉందని  ఓ అమెరిక‌న్ సినీ క్రిటిక్ అంటున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌లు తెగ పాపుల‌ర్ అయ్యారు. వీరి న‌ట‌న‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. 

జేమ్స్ బాంబ్ పాత్ర‌ల్లో రామ్ చ‌ర‌ణ్!

అమెరిక‌న్ టీవీ సిరీస్ 'ల్యూక్ కేజ్' సృష్టిక‌ర్త చియో హోడ‌రి కొక‌ర్ (Cheo Hodari Coker). చియో హోడ‌రి కొక‌ర్ ఓ ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్. ఈయన ఇటీవలే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చూశారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  న‌ట‌న చాలా బాగుందంటూ కితాబిచ్చారు. అంతేకాదు, త‌న సోష‌ల్ మీడియాలో రామ్ చ‌ర‌ణ్‌ను జేమ్స్ బాండ్ చిత్రాల‌తో స్టార్ న‌టుడుగా గుర్తింపు పొందిన డానియ‌ల్ క్రేగ్ నటనతో పోలుస్తూ ట్వీట్ చేశారు.

 

రామ్ చ‌ర‌ణ్‌  (Ram Charan)ను జేమ్స్ బాండ్ చిత్రాల‌తో స్టార్ న‌టుడిగా గుర్తింపు పొందిన డేనియల్ క్రేగ్ తో పోలుస్తూ చియో ట్వీట్ చేశారు. 

'ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన జేమ్స్ బాండ్ పాత్ర‌కు డానియ‌ల్ క్రేగ్ త‌ర్వాత  న్యాయం చేసే యాక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారా..?' అంటూ ఓ ప్రశ్నను ట్వీట్ రూపంలో సంధించారు చియో. దానికి సమాధానంగా జేమ్స్ బాండ్ పాత్ర‌ల్లో న‌టించేందుకు అన్ని అర్హతలు ఉన్న న‌టుడు రామ్ చ‌ర‌ణ్ అంటూ మళ్లీ ఆయనే పోస్ట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌తో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వ‌డం గ్యారెంటీ అంటూ అభిమానులు పలు పోస్టులు పెడుతున్నారు.

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ' ఆర్ సి 15' లో న‌టిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడిగా కియారా అద్వానీ న‌టిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న రెండో సినిమా ఇది. రామ్, కియారా అద్వానీ 'విన‌య విధేయ రామ‌'లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, సునీల్, అంజలి ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Read More: ఆర్‌సీ 15 (RC15) కోసం రామ్ చ‌రణ్ (Ram Charan) ఇంత క‌ష్టప‌డుతున్నారా!!!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!