స్టార్లు, వీఎఫ్ఎక్స్ ఉంటే సరిపోదు.. ‘కాంతార’ (Kantara)ను చూసి నేర్చుకోవాలనంటున్న ఆర్జీవీ (Ram Gopal Varma)

Updated on Oct 17, 2022 03:13 PM IST
చిన్న సినిమాగా రిలీజైన ‘కాంతార’.. పెద్ద సినిమాల రికార్డులను తిరగరాస్తోందని ఆర్జీవీ (Ram Gopal Varma) అన్నారు
చిన్న సినిమాగా రిలీజైన ‘కాంతార’.. పెద్ద సినిమాల రికార్డులను తిరగరాస్తోందని ఆర్జీవీ (Ram Gopal Varma) అన్నారు

కన్నడ సినిమా ‘కాంతార’ సృష్టిస్తున్న సంచనాలు అన్నీఇన్నీ కావు. చిన్న చిత్రంగా శాండల్‌వుల్‌లో రిలీజైన ఈ చిత్రం.. భాషలకు అతీతంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. సాధారణ ఆడియెన్స్‌తోపాటు సినీ సెలబ్రిటీలు కూడా ‘కాంతార’తో ప్రేమలో పడిపోతున్నారు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. 

కేవలం సూపర్ స్టార్లు ఉంటేనే సినిమాలు ఆడవని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే సూపర్ స్టార్స్, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అవసరమని అందరూ అనుకుంటున్నారు. కానీ ‘కాంతార’ లాంటి ఓ చిన్న చిత్రం.. పెద్ద సినిమాలు నెలకొల్పిన అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది’ అని ఆర్జీవీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కంటెంట్ ముఖ్యమని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.

ఇక, ‘కాంతార’పై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ చిత్రాన్ని రెండుసార్లు చూశానని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇలాంటి మూవీలను తప్పకుండా థియేటర్‌లోనే చూడాలని ఆయన చెప్పారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ‘కాంతార’ గురించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు.

‘కాంతార చిత్రాన్ని చూశానని.. సినిమా చాలా బాగుంది. ఈ మూవీకి పని చేసిన నటీనటులు, సాంకేతిక బృందానికి శుభాకాంక్షలు. తమ పనితీరుతో అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్‌ను అందించిన సినిమా టీమ్‌కు ధన్యవాదాలు. రిషబ్ శెట్టి ఎక్స్‌ట్రార్డినరీగా యాక్ట్ చేశారు’ అని అనుష్క తన సందేశాన్ని రాసుకొచ్చారు. సినిమాను థియేటర్లలోనే చూడాలని.. అస్సలు మిస్ అవ్వొద్దని స్వీటీ కోరారు. 

ఇక, ‘కేజీఎఫ్’ను నిర్మించిన హొంబలే ప్రొడక్షన్స్ సంస్థ.. ‘కాంతార’ చిత్రాన్ని రూపొందింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించడమే గాక దర్శకత్వం వహించారు. మూవీకి కథనూ ఆయనే అందించారు. ‘కాంతార’లో రిషబ్ సరసన సప్తమి గౌడ కథానాయికగా నటించారు. ప్రముఖ నటులు కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ‘కాంతార’కు అంజనీష్‌ లోక్‌‌నాథ్‌ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. కన్నడలో సక్సెస్‌‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా దూసుకెళ్తోంది.

కాగా, కన్నడలో మంచి టాక్ రావడంతో ‘కాంతార’కు తెలుగులోనూ మంచి బజ్ ఏర్పడింది. అయితే ఇక్కడ అంతగా పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఓపెనింగ్స్ ఎంత వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. కానీ సినిమాకు మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది. మౌత్ పబ్లిసిటీ ఫుల్ పాజిటివ్‌గా ఉండటంతో తెలుగు నాట ‘కాంతార’కు సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజే సుమారు రూ.4 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే.. దీపావళి వరకు ‘కాంతార’కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. 

Read more: తెలుగు నాట ‘కాంతార’ (Kantara) మూవీ సంచలనం.. తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!