‘కాంతార’ (Kantara)ను చూపు తిప్పుకోకుండా చూశా.. తప్పకుండా అందరికీ నచ్చుతుంది: అల్లు అరవింద్ (Allu Aravind)
ఇప్పుడు ఎక్కడ విన్నా ‘కాంతార’ (Kantara) గురించే వినిపిస్తోంది. కన్నడ నాట రిలీజైన 11 రోజుల్లో రూ.58 కోట్లను వసూలు చేసిందీ చిత్రం. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ రన్‌ను కొనసాగిస్తోంది. ‘కేజీఎఫ్’ను నిర్మించిన హొంబలే ప్రొడక్షన్స్ హౌస్ నుంచి వచ్చిన ఈ సినిమాలో ఏముందనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ తెలుగులోకి తీసుకొస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇటీవలే విడుదలైన ‘కాంతార’ (Kantara Trailer) తెలుగు ట్రైలర్‌కు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే, ఈ సినిమా గురించి నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విభిన్నమైన సినిమాలు కోరుకునే వారికి ‘కాంతార’ తప్పకుండా నచ్చుతుందని ఆయన అన్నారు.
‘కాంతార చూసిన తర్వాత ఇన్ని సినిమాలు తీసిన నేను కూడా వారి దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలని అనిపించింది. విభిన్నమైన సినిమాలు కావాలనుకునే వారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ‘పుష్ప’ మూవీలాగే ఇది కూడా అడవి నేపథ్యంలో నడిచే కథ. ‘పుష్ప’ చూసి ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో.. అదే నేపథ్యంలో వస్తున్న ‘కాంతార’నూ అంతే ఇష్టపడతారు. ఇందులో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మాత్రమే కాదు.. విష్ణుతత్వాన్ని కూడా చెప్పారు. రీసెంట్‌గా వచ్చిన ఈ తరహా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ‘కాంతార’ను రిషబ్ శెట్టి ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశారో.. అంతే బాగా యాక్ట్ చేశారు. సుమారు 40 నిమిషాల వరకు చూపు తిప్పుకోకుండా ఈ సినిమాను చూశాను’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
‘కాంతార’ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఈ చిత్ర దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) చెప్పారు. గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక ‘కాంతార’లో రిషబ్ శెట్టితో పాటు సప్తమి గౌడ, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 15న తెలుగులో విడుదల కానుంది. మరి కన్నడలో బంపర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Read more: ఆర్‌సీ15 మూవీ పిక్స్ లీక్.. షాక్‌లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ (RamCharan), డైరెక్టర్ శంకర్