‘కాంతార’ (Kantara) సినిమాను రెండుసార్లు చూశా.. ఇదో థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌: ప్రభాస్ (Prabhas)

Updated on Oct 15, 2022 10:55 AM IST
‘కాంతార’ (Kantara) మూవీని తప్పకుండా థియేటర్లలోనే చూడాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అన్నారు 
‘కాంతార’ (Kantara) మూవీని తప్పకుండా థియేటర్లలోనే చూడాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అన్నారు 

కన్నడ నాట ఇటీవల విడుదలైన ‘కాంతార’ (Kantara) అనే మూవీ సంచలనం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఫిల్మ్‌ను చూసేందుకు అక్కడి ఆడియెన్స్‌ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు కర్ణాటకలో ఈ సినిమా దాదాపు రూ. 58 కోట్లు వసూలు చేసింది. సక్సెస్‌ఫుల్ రన్‌ను ఇంకా కొనసాగిస్తోంది. శాండల్ వుడ్ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ చిత్రం ఇప్పుడు పలు భాషల్లోకి డబ్ అయ్యి విడుదలవుతోంది. హిందీ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజవ్వగా.. తెలుగు వెర్షన్‌ను మేకర్స్ ఇవ్వాళ విడుదల చేస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

తాజాగా ‘కాంతార’ చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చూశారు. ఈ మూవీ తనను చాలా ఇంప్రెస్ చేసిందని ప్రభాస్ అన్నారు. ‘కాంతార చిత్రాన్ని రెండుసార్లు చూశా. ఇదో అసాధారణమైన అనుభవం. నిజంగా ఇది థ్రిల్లింగ్ కాన్సెప్ట్. క్లైమాక్స్ కూడా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాలి’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రభాస్ పోస్ట్ చేశారు. ‘కాంతార’ ఓ స్పెషల్ మూవీ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా ‘కాంతార’ను రూపొందించిన హొంబలే ఫిల్మ్స్ నిర్మింస్తుండటం గమనార్హం. 

‘కాంతార’ చిత్రం విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. కోస్టల్ కర్ణాటకలో కనిపించే కాంబ్లా, బూటకోలా సంప్రదాయాల ఆధారంగా యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి రూపొందించారు. ఇందులో రిషబ్ సరసన సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ఆమెకు ఇది రెండో సినిమా కావడం విశేషం. అలాగే కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రకాష్ తుమినాడ్, ప్రమోద్ శెట్టి, నవీన్ డి పాడిల్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ‘కాంతార’ మలయాళ డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 20న కేరళలో రిలీజ్ కానుంది. 

Read more: రేటింగ్స్‌లో నయా రికార్డు.. ‘కేజీఎఫ్’ (KGF), ‘ఆర్ఆర్ఆర్’ (RRR)ను వెనక్కి నెట్టిన ‘కాంతార’ (Kantara) మూవీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!