Tamannaah: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ (Jailer) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ తమన్నా

Updated on Aug 11, 2022 07:33 PM IST
‘జైల‌ర్’ (Jailer) సినిమాలో ర‌జ‌నీకాంత్‌కు జోడీగా ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారిన నేపథ్యంలో ఆ ఛాన్స్ త‌మ‌న్నాకు ద‌క్కిన‌ట్లు స‌మాచారం.
‘జైల‌ర్’ (Jailer) సినిమాలో ర‌జ‌నీకాంత్‌కు జోడీగా ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారిన నేపథ్యంలో ఆ ఛాన్స్ త‌మ‌న్నాకు ద‌క్కిన‌ట్లు స‌మాచారం.

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth), స్టార్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ (Nelson Dilip kumar) కాంబినేషన్ లో ‘జైలర్’(Jailer) సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా, రోజురోజుకీ ఈ చిత్రంలో నటించే తారాగణం సంఖ్య పెరిగిపోతుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించనుండగా.. ఇప్పుడు తమన్నా కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.   

‘జైల‌ర్’ (Jailer) సినిమాలో ర‌జ‌నీకాంత్‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది కోలీవుడ్ (Kollywood) ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రంగా మారిన నేపథ్యంలో.. ఆ ల‌క్కీఛాన్స్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు ద‌క్కిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే త‌మ‌న్నాను క‌లిసిన దిలీప్‌కుమార్ ఆమెకు క‌థ‌ను వినిపించిన‌ట్లు తెలిస్తోంది. ఇక, ర‌జ‌నీకాంత్ సినిమా కావ‌డంతో త‌మ‌న్నా జైల‌ర్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఆగ‌స్ట్ 15 నుంచి త‌మ‌న్నా ఈ సినిమా షూటింగ్‌లో భాగం కాబోతున్న‌ట్లు తెలుస్తోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా (Milky Beauty Tamannaah)

కాగా, ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) 'భోళాశంక‌ర్' సినిమాలో నటిస్తోంది. ఆమె హీరోయిన్‌గా న‌టించిన 'గుర్తుందా శీతాకాలం' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 'జైలర్' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. చిత్రీకరణ కోసం భారీ సెట్లు వేశారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 

దక్షిణాది చిత్రపరిశ్రమలో తమన్నా (Tamannaah) స్థానం ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇప్పటికీ యువతరం కథానాయికలుగా గట్టి పోటీనిస్తుంది మిల్కీబ్యూటీ. ఇటీవలే 'ఎఫ్ 3' (F3) సినిమాతో ఆడియన్స్‏ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. 

Read More: Kajal & Tamannaah: పాపులర్ ఛాలెంజ్ 'షీ ఈజ్ ఏ 10' లో పాల్గొన్న కాజల్ అగర్వాల్, తమన్నా.. పోస్ట్ వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!