10 రోజుల్లో 5 కోట్ల వ్యూస్.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న దళపతి విజయ్‌ (Vijay) ‘రంజితమే’ పాట (Ranjithame Song)

Updated on Nov 16, 2022 01:55 PM IST
‘రంజితమే’ పాట (Ranjithame Song) రిలీజై పది రోజులు కావొస్తున్నా.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతుండటం విశేషం
‘రంజితమే’ పాట (Ranjithame Song) రిలీజై పది రోజులు కావొస్తున్నా.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతుండటం విశేషం

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తనదైన మార్క్ నటన, డ్యాన్సులు, ఫైట్లతో అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులను కూడా దళపతి విజయ్ ఉర్రూతలూగిస్తుంటారు. అందుకే విజయ్ మూవీస్‌కు అంత డిమాండ్ ఉంటుంది. అలాంటి విజయ్ ‘వరిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమాతో త్వరలో ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. 

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘వరిసు’ (Varisu) సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ నటులు జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. 

ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘వరిసు’ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ బాణీలు సమకూర్చుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘రంజితమే’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజై పది రోజులు అవుతున్నప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకు ఈ పాట 5 కోట్ల వ్యూస్, 18 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే, విజయ్ గత చిత్రం ‘బీస్ట్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్న విజయ్.. ‘వారసుడు’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

తెలుగులోనూ ‘వారసుడు’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజయ్‌కు ఇక్కడా మార్కెట్ పెరిగింది. ‘తుపాకీ’, ‘పోలీసోడు’, ‘స్నేహితుడు’, ‘సర్కార్’. ‘అదిరింది’, ‘విజిల్’, ‘మాస్టర్’ చిత్రాలు తెలుగునాట మంచి వసూళ్లు సాధించాయి. దీంతో ‘వారసుడు’ సినిమాను టాలీవుడ్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. 

ఇకపోతే, ‘వారసుడు’ (Vaarasudu) తర్వాత కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నారు. ఇది ఆయనకు 67వ చిత్రం కానుంది. లోకేష్ ఈ సినిమాను లావిష్‌గా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇక, విజయ్ 68వ ఫిల్మ్ గురించి ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ బ్యానర్‌లో చేయడానికి దళపతి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే మైత్రి మూవీస్ (Mythri Movies) నుంచి విజయ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు వినికిడి. 

Read more: బాలయ్య (Balakrishna) సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్!.. నందమూరి నటసింహంతో అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఢీ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!