బాలయ్య (Balakrishna) సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్!.. నందమూరి నటసింహంతో అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఢీ?

Updated on Nov 16, 2022 12:19 PM IST
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య (Balakrishna) నటించబోయే మూవీలో విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ (Arjun Rampal) నటించనున్నారని టాక్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య (Balakrishna) నటించబోయే మూవీలో విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ (Arjun Rampal) నటించనున్నారని టాక్

వరుస ఓటములతో సతమతమైన నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) చాన్నాళ్ల తర్వాత ‘అఖండ’ సినిమాతో గ్రాండ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఆడియెన్స్ థియేటర్స్‌కు రాకపోవడంతో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి సమయంలో థియేటర్ల దగ్గర జాతర నడిచేలా చేశారు బాలయ్య. మార్నింగ్ షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ‘అఖండ’ ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. ప్రస్తుతం అదే జోష్‌లో ఉన్న బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. శ్రీలీల కీలకపాత్రలో యాక్ట్ చేయనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోయే సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడ్ని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం హిందీ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal)ను మేకర్స్ ఎంపిక చేశారట. అయితే బాలయ్య మూవీలో అర్జున్ రాంపాల్ సెలెక్ట్ అయ్యారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై అధికారిక సమాచారం వస్తే కానీ ఏదీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్​ హీరోగా యాక్ట్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’లో ప్రతినాయకుడి క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు.

కంప్లీట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఎన్‌బీకే (NBK108) రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బాల‌య్య తండ్రి పాత్రలో న‌టించ‌నున్నారని తెలుస్తోంది. బాల‌య్య కూతురులా శ్రీలీల యాక్ట్ చేయనున్నారట. తండ్రి–కూతురు ఎమోష‌న్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇందులో బాల‌కృష్ణ‌కు జోడీగా అంజ‌లి న‌టించ‌నున్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ఎస్ఎస్ థ‌మ‌న్ బాణీలు సమకూరుస్తున్నారు. 

Read more: రెండు భాషల్లో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా? తారక్‌ ఓకే చెప్పారా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!