Shamshera : షంషేరా 'జీ హుజూర్' తెలుగు సాంగ్ ప్రోమో రిలీజ్.. అద‌ర‌గొడుతున్న‌ ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) !

Updated on Jun 29, 2022 12:14 PM IST
Shamshera : ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) న‌టిస్తున్న షంషేరా 'జీ హుజూర్' తెలుగు సాంగ్ ప్రోమో రిలీజ్
Shamshera : ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) న‌టిస్తున్న షంషేరా 'జీ హుజూర్' తెలుగు సాంగ్ ప్రోమో రిలీజ్

Shamshera : బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) టాలీవుడ్‌లోనూ త‌న స‌త్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. షంషేరా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన జీ హుజూర్ తెలుగు పాట ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ర‌ణ‌బీర్ మాస్ స్టెప్పులతో జీ హుజూర్‌లో అద‌ర‌గొట్టారు. జీ హుజూర్ ఫుల్ సాంగ్‌ను జూన్ 22 న రిలీజ్ చేయ‌నున్నారు. 

ర‌ణ్‌బీర్ క‌పూర్ ఇక‌పై న‌టిస్తున్న సినిమాలు తెలుగులోనూ విడుద‌ల కానున్నాయి. బ్ర‌హ్మాస్త్రం, షంషేరా సినిమాల‌తో ర‌ణ‌బీర్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు.  షంషేరా సినిమా టీజ‌ర్‌ విడుదలైంది. ఈ సినిమాకు క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ షంషేరా చిత్రాన్ని నిర్మిస్తోంది. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న 50 వ చిత్రం షంషేరా.

 

పోరాట యోధుడిగా ర‌ణ్‌బీర్

ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) న‌టిస్తున్న 'షంషేరా'కు సంబంధించి ఇటీవ‌లే తెలుగు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 'క‌ర్మ వ‌ల్ల దొంగ‌లం.. ధ‌ర్మంగా స్వ‌తంత్రులం' అనే డైలాగులతో కూడిన ఆ పోస్టర్, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక ర‌ణ్‌బీర్ చేతిలో గొడ్డ‌లి .. ఎలాంటి ర‌క్త పాతం సృష్టిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 'షంషేరా' చిత్ర ట్రైల‌ర్‌ను జూన్ 24 రిలీజ్ చేయ‌నున్నారు.

ఓ కరడుగట్టిన పోరాట యోధుడిగా ర‌ణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. త‌న వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు హీరో ఏం చేయ‌నున్నార‌నే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక ఈ చిత్రంలో కూడా ప్రతి నాయకులకు పెద్ద పీటే వేశారు దర్శకుడు. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' సినిమాలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా అద్భుత‌మైన న‌ట‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇక 'షంషేరా'లో కూడా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు సంజ‌య్ ద‌త్.

ర‌ణ్‌బీర్ కపూర్, సంజ‌య్ ద‌త్‌ల మ‌ధ్య ఎలాంటి భీక‌ర‌మైన యుద్ధం జ‌రుగుతుందో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. 'షంషేరా' సినిమా హిందీతో పాటు త‌మిళ, తెలుగు భాష‌ల్లో జూలై 22న‌ విడుద‌ల కానుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్ 'షంషేరా, 'బ్రహ్మాస్త్రం' సినిమాలతో మొద‌టి సారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 

Read More: బ్ర‌హ్మాస్త్రం (Brahmastra ) : బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో.. కింగ్ నాగార్జున (Nagarjuna) ప‌వ‌ర్ ఫుల్ లుక్ రిలీజ్ !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!