Brahmastram:‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్ సింగిల్ తెలుగు ప్రోమో రిలీజ్ చేసిన ద‌ర్శ‌క ధీరుడు

Updated on May 28, 2022 11:23 PM IST
Brahmastram: బ్రహ్మాస్త్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ తెలుగు వ‌ర్షెన్ ప్రోమోను ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి రిలీజ్ చేశారు. 
Brahmastram: బ్రహ్మాస్త్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ తెలుగు వ‌ర్షెన్ ప్రోమోను ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి రిలీజ్ చేశారు. 

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బ్రహ్మాస్త్రం (Brahmastram). బాలీవుడ్ న‌టులు ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌ల‌తో పాటు బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో మూడు భాగాలుగా బ్ర‌హ్మాస్త్రం సినిమా రిలీజ్ కానుంది. బ్ర‌హ్మ‌స్త్ర పార్ట్ వ‌న్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ టీజ‌ర్ రిలీజ్ అయింది. తెలుగు టీజ‌ర్‌ను రాజ‌మౌళి (S. S. Rajamouli) విడుద‌ల చేశారు.

హిందీలో నెల క్రితం కేస‌రియా టీజ‌ర్‌ను ర‌ణ‌బీర్ , అలియ్ భ‌ట్ పెళ్లి కానుక‌గా రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఆ టీజ‌ర్‌ను తెలుగులో కుంకుమ‌లా టైటిల్‌తో రాజ‌మౌళితో విడుద‌ల చేయించారు. బ్రహ్మాస్త్రం వ‌న్ సినిమా నుంచి కుంకుమలా పాట ప్రొమోను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని రాజ‌మౌళి ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంద‌ని తెలిపారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లంటూ రాజ‌మౌళి సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.

హిందీలో రిలీజ్ అయిన కేస‌రియా సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అమిత్ భ‌ట్టాచార్య హిందీలో లిరిక్స్ రాయ‌గా..ఆర్జిత్ సింగ్ పాడారు. తెలుగులో చంద్ర‌బోస్ కుంకుమ‌లా పాట‌ను రాశారు. స్టార్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ పాడారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ఐదేళ్ల క్రితం నుండి, ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌టం విశేషం. భారీ బ‌డ్జెట్‌తో బ్ర‌హ్మాస్త్రం (Brahmastram) సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల‌ బడ్జెట్‌తో ఇది రూపొందనుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో బ్ర‌హ్మాస్త్రం విడుద‌ల కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!