Niharika Konidela : నిహారిక కొణిదెల ట్రై చేసిన ‘గంగూ భాయ్’ ఫోజ్.. అలియానే మైమరిపించిందా?

Updated on Sep 20, 2022 07:15 PM IST
నిహారిక కొణిదెల (Niharika Konidela) గతంలో ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ లాంటి సినిమాలలో కథానాయికగా నటించింది.
నిహారిక కొణిదెల (Niharika Konidela) గతంలో ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ లాంటి సినిమాలలో కథానాయికగా నటించింది.

'గంగూ భాయ్' (Gangubai) చిత్రం గుర్తుందా? ఈ సినిమాలో అలియా భట్ (Alia Bhatt) టైటిల్ రోల్‌లో మంచి పరిణితితో కూడిన నటనను ప్రదర్శించింది. అలాగే ఆ పాత్రకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'గంగూభాయ్ కథియావాడి' చిత్రంలో అలియా వైట్ అండ్ వైట్ చీరకట్టుతో పాటు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని, తన అభిమానులతో ఈలలు వేయించింది. 

కాగా, ఇటీవలే ఓ టాలీవుడ్ నటి కూడా 'గంగూభాయ్' గెటప్‌లో ఓ పుట్టినరోజు కార్యక్రమంలో దర్శనమిచ్చింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు .. మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela). తన స్నేహితుడు నిఖిల్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా, నిర్వాహకులు మూవీ థీమ్‌ కలిగిన  డ్రెస్సులు ధరించి రావాలని కోరగా.. నిహారిక ఇలా 'గంగూభాయ్' గెటప్‌లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

అలియాని మరిపించి..

ఈ గెటప్‌లో నిహారిక అచ్చం గంగూభాయ్‌లా (Gangubai) కనిపించడంతో, ఆశ్చర్యపోవడం ఆమె స్నేహితులవంతైంది. అంతేకాదు.. ఈ వేడుకలలో నిహారిక అచ్చం అలియా పోషించిన గంగూభాయ్ పాత్రలో ఒదిగిపోయి, కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చింది. ముఖ్యంగా అలియా ట్రేడ్ మార్క్ ఫోజును రీక్రియేట్ చేయడంలో నిహారిక సక్సెస్ కావడంతో, అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

కథానాయికగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ..

నిహారిక (Niharika Konidela) తెలుగులో ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాలలో కథానాయికగా నటించింది. కానీ అవేవీ అంతగా ప్రజాదరణ పొందలేదు. అలాగే 'నాన్న కూచి' అనే వెబ్ సిరీస్‌లో తన తండ్రి నాగబాబుతో కలిసి నటించింది నిహారిక. అలాగే అప్పుడప్పుడు ఈటీవీలో వచ్చే పలు ప్రోగ్రామ్స్‌లో సరదాగా యాంకరింగ్ కూడా చేయడం నిహారికకు అలవాటు. 

2020 సంవత్సరంలో నిహారిక వివాహం చైతన్య జొన్నలగడ్డతో (Chaitanya Jonnalagadda) ఉదయ్ పూర్‌లోని ఒబెరాయ్ విలాస్‌లో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నిహారిక ఎక్కువగా చిత్ర నిర్మాణ రంగంపై ఫోకస్ పెట్టింది. కొన్ని వెబ్ సిరీస్‌లను కూడా ప్రొడ్యూస్ చేసింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ లాంటివి అందులో ప్రముఖమైనవి.

Read More: నిహారిక కొణిదెల‌ (Niharika Konidela): భ‌ర్త‌తో విభేదాలపై నిహారిక క్లారిటీ

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!