పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ (Alia Bhatt).. తల్లిదండ్రులైన బాలీవుడ్ (Bollywood) క్యూట్ కపుల్!

Updated on Nov 07, 2022 11:58 AM IST
ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో (Ranbir Kapoor) కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా.. మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు.
ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో (Ranbir Kapoor) కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా.. మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 14న స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగా వైభవంగా వీరి వివాహం జరిగింది. అయితే, జూన్ లో తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది అలియా.

అప్పట్లో ఆసుపత్రిలో పరీక్షలకు సంబంధించిన ఓ ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు అలియా భట్. ఇక, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అలియా సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ లో పాల్గొంది. 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) సినిమా విడుదల తర్వాత నుంచి అలియా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. 

ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో (Ranbir Kapoor) కలిసి ముంబయిలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా.. మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. రణబీర్‏తోపాటు సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆసుపత్రిలో అలియాతో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. పాప రాకతో కపూర్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు అలియా భట్ (Alia Bhatt) రణ్ బీర్ కపూర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తోటి నటీనటులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట నెల రోజులకే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేయడం.. ఇప్పుడేమో పెళ్లయిన 7నెలలకే పాప పుట్టడంతో ఈ న్యూస్ ట్రెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో నెటిజన్లు ఓ కొత్త లెక్కని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇద్దరికీ వివాహమై కేవలం 6 నెలల 23 రోజులే అయ్యింది. ఇంత తక్కువ వ్యవధిలోనే అలియాకి బిడ్డ ఎలా? అంటూ నెటిజన్లు కొత్త ప్రశ్నని తెరపైకి తీసుకొచ్చారు. 

Read More: Alia Bhatt: 'మీకు నచ్చకపోతే, నా సినిమాలు చూడొద్దు..’ బాలీవుడ్ (Bollywood) జనాలపై అలియా భట్ ఆగ్రహం..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!