Brahmastra: 'బ్రహ్మాస్త్రం' ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే.. వీకెండ్‌పైన ఆశలు పెట్టుకున్న మేకర్స్
Brahmastra: బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్తం' మొదటి భాగం - 'శివ' (Brahmastra) విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లను షేక్ చేస్తుంది. విజువల్ వండర్‌గా దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఈ సినిమాను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండింగ్‌లోనూ పాన్ ఇండియా సినిమా 'బ్రహ్మాస్త్రం' పోటీని తట్టుకుని నిలబడగలిగింది. ఈ వారం చివరి రెండు రోజులపైనే 'బ్రహ్మాస్త్రం' మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.
అనుకున్నంత కలెక్షన్ రాలేదా!
'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 9న ఐదు భాషల్లో రిలీజ్ అయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'బ్రహ్మాస్త్రం' తెలుగు వర్షన్‌ను దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పించారు. ఈ సినిమా మొదటి రోజు రూ. 35 కోట్లు వసూళ్లు చేసింది. ఇక శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్ కొల్లగొడుతుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. రివ్యూల పరంగా 'బ్రహ్మాస్త్రం' మిక్స్డ్ టాక్ అందుకుంది. 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'ఆర్ఆర్ఆర్' సినిమాల కంటే కలెక్షన్ తక్కువగానే ఉంటుందని క్రిటిక్స్ భావిస్తున్నారు.
ఆన్‌లైన్ టికెట్ల జోరు
'బ్రహ్మాస్త్రం' (Brahmastra) చిత్రం ఆన్‌లైన్ టికెట్ల బుక్సింగ్స్ బాగానే జరిగాయి. టికెట్లు 'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువగానే అమ్ముడుపోయాయి. లక్షకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాకు అత్యధికంగా 5 లక్షలకు పైగా ఆన్‌లైన్ టికెట్లు అమ్ముడయ్యాయి. 'బ్రహ్మాస్త్రం' సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిన్నారుల కోసం తీశారంటూ కొందరు కామెంట్ చేశారు. హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో ఈ రోజు వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాకు కలెక్షన్ తగ్గింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో వారాంతంలో తెలుస్తుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.
ఈ సినిమాలో స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ నటించారు. నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ వంటి దిగ్గజాలు ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించారు. హిందూ పురాణాల ఆధారంగా దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఈ సినిమాను చిత్రీకరించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, హిరు యష్ జోహార్, రణబీర్ కపూర్, ఆయాన్ ముఖర్జీలు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
Read More: Brahmastra Movie Review: 'బ్రహ్మాస్త్రం మొదటి భాగం - శివ' రివ్యూ.. అస్త్రాల ప్రపంచంలో అద్భుతాలు