ప్రపంచ వ్యాప్తంగా ‘బ్రహ్మాస్తం’ (Brahmastram) రెండు రోజుల కలెక్షన్స్ రూ. 160 కోట్లు.. అధికారిక ప్రకటన!
బాలీవుడ్ స్టార్ నటీనటులు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్తం’ (Brahmastram). అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రానిక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీలో అక్కినేని నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు ప్రత్యేక పాత్రల్లో నటించారు.
'బ్రహ్మాస్త్రం' తెలుగు వర్షన్‌ను దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సమర్పిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి. 'బ్రహ్మాస్త్రం' సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలయింది. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు.
అయితే తొలిరోజు మంచి వసూళ్లను సాధించిన 'బ్రహ్మాస్త్రం' (Brahmastram) సినిమా.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాన్ హాలిడే రోజు ఈ మూవీ విడుదలైనప్పటికీ భారీ వసూళ్లు సాధించడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8913 స్క్రీన్లల్లో విడుదలైన ఈ మూవీ రెండో రోజు దాదాపు రూ.85 కోట్ల మేర వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.160 కోట్లకు (Brahmastram Collections) చేరిందని తెలిపింది. హిందీతో పాటు అన్ని భాషల్లో సినిమాకు చక్కటి కలెక్షన్స్ వస్తున్నాయని పేర్కొంది. 2డీ వెర్షన్ తో పాటు త్రీడీకి కూడా చక్కటి ఆదరణ లభిస్తోందని వెల్లడించింది. ఈ సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' సినిమా అధికారిక ట్విట్టర్ పేజీ.. రెండు రోజుల్లో బాక్సాఫీసు రూ.160 కోట్ల వసూళ్లను నమోదు చేసిందంటూ ఓ గ్రాఫిక్ ఇమేజ్ ను పోస్ట్ చేసింది. మరి, బ్రహ్మాస్త్ర రెండో వారంలోనూ ఇదే మాదిరి వసూళ్లు కొనసాగిస్తుందా? అన్నది చూడాలి.