Brahmastra: విశాఖ‌లో బ్రహ్మాస్త్ర టీం సంద‌డి.. పూల వాన కురిపించిన అభిమానులు

Updated on May 31, 2022 06:39 PM IST
 విశాఖలో బ్రహ్మాస్త్ర ( Brahmastra) మూవీ ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లు పెట్టిన‌ రణ్‌బీర్ కపూర్, రాజమౌళిల‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
విశాఖలో బ్రహ్మాస్త్ర ( Brahmastra) మూవీ ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లు పెట్టిన‌ రణ్‌బీర్ కపూర్, రాజమౌళిల‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

Brahmastra: విశాఖలో బ్రహ్మాస్త్ర టీమ్ సందడి చేసింది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ జంట నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబ‌ర్ 9న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. బ్ర‌హ్మాస్త్ర సినిమా రాజ‌మౌళి(SS Rajamouli) స‌మ‌ర్ప‌ణ‌లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లు పెట్టారు. విశాఖ‌ప‌ట్నంలో మూవీ ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లు పెట్టిన‌ రణ్‌బీర్ కపూర్, రాజమౌళిల‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పూల వ‌ర్షాన్ని కురింపించి మ‌రీ త‌మ అభిమానాన్ని చూపారు.

సింహాచ‌లంలో ఆద్యాత్మిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ రాజ‌మౌళి, ర‌ణ‌బీర్
విశాఖ‌కు వెళ్లిన ర‌ణ్‌బీర్, రాజ‌మౌళిలు ముందుగా సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శనం చేసుకున్నారు. బ్రహ్మాస్త్ర (Brahmastra)  దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా వీరి వెంట ఉన్నారు. సింహాచలం దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. ఆలయ అధికారులు వారిని సన్మానించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తరువాత కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్నారు.

Brahmastra:  విశాఖ‌కు వెళ్లిన ర‌ణ్‌బీర్, రాజ‌మౌళిలు ముందుగా సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శనం చేసుకున్నారు.

పూల వ‌ర్షం కురిపించిన అభిమానులు
సింహాచ‌లం అప్ప‌న్న  స్వామిని ద‌ర్శించుకున్న ర‌ణ్‌బీర్‌పై అభిమానులు పూల వ‌ర్షం కురిపించారు. గ‌జ మాల‌తో స‌త్క‌రించారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌ర‌స్ డ్రామాగా బ్ర‌హ్మాస్త్ర సినిమాను మూడు భాగాలుగా తీస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారు.  గ‌త నెల‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. ఇక ప్ర‌మోష‌న్ల స్పెష‌లిస్గు రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం వ‌స్తుంది. దీంతో చిత్ర‌బృందం ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్ల‌ను డిఫెరెంట్‌గా ప్లాన్ చేసింది. హిందీతో పాటు తెలుగులో కూడా భారీగా ప్ర‌మోట్ చేయాల‌ని చిత్ర‌బృందం ప్లాన్ చేస్తుంద‌ట‌. 

 

మూడు భాగాలుగా తెర‌కెక్కిన బ్రహ్మాస్త్ర (Brahmastra)  చిత్రం హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. బాలీవుడ్ దిగ్గ‌జాలు అమితాబ్ బ‌చ్చ‌న్, షారూక్ ఖాన్ కూడా బ్ర‌హ్మాస్త్ర‌లో న‌టిస్తున్నారు ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా తెలుగులో కుంకుమాల పాట‌ను రిలీజ్ చేశారు. జూన్ 15న బ్ర‌హ్మాస్త్ర ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!