ఓటీటీలోనూ సత్తా చూపించబోతున్న 'బ్రహ్మాస్త్ర'(Brahmastra).. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..!

Updated on Nov 04, 2022 10:43 AM IST
'బ్రహ్మాస్త్ర' మూవీ ఓటీటీలో (Brahmastra in OTT) స్ట్రీమింగ్‏కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రసారమవుతోంది.
'బ్రహ్మాస్త్ర' మూవీ ఓటీటీలో (Brahmastra in OTT) స్ట్రీమింగ్‏కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రసారమవుతోంది.

బాలీవుడ్‌ క్యూట్​ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). టాప్ డైరెక్టర్ అయిన  అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇందులో అక్కినేని నాగార్జున (Nagarjuna), అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటించారు. 

ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) రిలీజ్‌ చేశాడు. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు గతంలో అయాన్ ముఖర్జీ తెలిపారు. ఇందులో తొలి భాగం 'శివ' పేరుతో విడుదలయి సూపర్ హిట్ గా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా 'బ్రహ్మాస్త్ర' మూవీ ఓటీటీలో (Brahmastra in OTT) స్ట్రీమింగ్‏కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోగా.. గురువారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు కేవలం హిందీలోనే కాకుండా.. తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

'బ్రహ్మాస్త్ర' సెకండ్ పార్ట్ లో (Brahmastra 2) కీలక పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారని టాక్ వినిపిస్తోంది. రణవీర్ సింగ్, హృతిక్ రోషన్ పేర్లు కొద్ది రోజులుగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇకపోతే 'బ్రహ్మాస్త్ర' పార్ట్ 2ను 2025 డిసెంబర్ నాటికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Read More: 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) ఆఫర్ ను వదులుకున్నా.. కారణమిదే అంటున్న హీరో సుధీర్ బాబు (Hero Sudhher Babu)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!