‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)–ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టింది. ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో తెలుగులోనూ ఈ చిత్రం విడుదలైంది. తెలుగు నాట ఈ మూవీ త్రీడీ వెర్షన్‌కు మంచి వసూళ్లు దక్కాయి.
‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబర్ 23 నుంచి ‘బ్రహ్మాస్త్ర’ను తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచేందుకు హాట్‌స్టార్ ప్లాన్ చేస్తోందని సమాచారం. త్వరలోనే దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఒకవేళ దీపావళికి ఈ సినిమా స్ట్రీమింగ్ షురూ అయితే మాత్రం ఆడియెన్స్‌కు పండగేనని చెప్పాలి. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను చూడని వారికి ఓటీటీలో చూసే ఛాన్స్ దక్కుతుంది. మరి, దీపావళికి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో లేదో చూడాలి.
ఇకపోతే, ‘బ్రహ్మాస్త్ర’ కథను హిందూ పురాణాల ఆధారంగా రాసుకున్నారు అయాన్ ముఖర్జీ. పలు హాలీవుడ్ గ్రాఫిక్స్ స్టూడియోల సహాయంతో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా ఆయన తెరకెక్కించారు. మొత్తానికి కొన్నేళ్ల పాటు ఆయన పడిన కష్టం వృథా కాలేదు. మంచి ప్రాఫిట్స్‌తో ‘బ్రహ్మాస్త్ర’ ఫుల్ రన్‌ను ముగించింది. ఇక, ఈ సినిమా ఓటీటీలో రిలీజైతే మరింత మంది ప్రేక్షకులకు చేరువవతుంది. తద్వారా ఈ మూవీ సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. కాగా స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, రణబీర్ కపూర్, ఆయాన్ ముఖర్జీలు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.