ఆలియా (Alia Bhatt), రణ్​బీర్​ (Ranbir Kapoor) ఇంట్లో సందడి.. సీమంతం ఫొటోలు వైరల్

Updated on Oct 07, 2022 01:28 PM IST
ఆలియా (Alia Bhatt) సీమంతం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
ఆలియా (Alia Bhatt) సీమంతం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) త్వరలో తల్లి కాబోతున్న విషయం అందరకీ తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు సీమంతం జరిపారు. ముంబైలోని రణ్‌బీర్ (Ranbir Kapoor) ఇంట్లో బుధవారం ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్, ఆలియా పేరెంట్స్ సోనీ రజ్దాన్, మహేష్ భట్ తోపాటు సమీప బంధువులు పాల్గొన్నారు. 

ఆలియా సీమంతం ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వేడుకలో పసుపు రంగు డ్రెస్‌లో ఆలియా సింపుల్‌గా కనిపించగా.. భార్యకు ముద్దు పెడుతూ రణ్‌బీర్ మురిసిపోయారు. ఈ సెలబ్రేషన్స్‌లో శ్వేతా బచ్చన్‌, నిఖిల్‌ నందా, రీమా జైన్‌, బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌ హాజరయ్యారు. వీరితోపాటు ‘బ్రహ్మాస్త్ర’ మూవీ డైరెక్టర్ అయాన్‌ ముఖర్జీ కూడా పాల్గొనడం విశేషం. 

‘బ్రహ్మాస్త్ర’ హిట్‌తో ఫుల్ హ్యాపీ 

రణ్‌బీర్‌, ఆలియా 2017లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం షూటింగ్‌ సమయంలో దగ్గరయ్యారు. అప్పటినుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అంటూ ఆలియా గుడ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్ తమ బిడ్డ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ కలసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం గత నెలలో రిలీజైంది. ఈ మూవీ దాదాపుగా రూ.450 కోట్లకు పైగా వసూలు రాబట్టి.. మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఆలియా, రణ్‌బీర్‌లు ఆ సెలబ్రేషన్స్‌ కూడా జరుపుకుంటున్నారు.

ఎంత కష్టపడటానికైనా రెడీ

ఆలియా భట్‌ ఇటీవల సింగపూర్‌లో ‘టైమ్‌100 ఇంఫాక్ట్‌’  పురస్కారాన్ని అందుకున్నారు. ఆ కార్యక్రమంలో ఆలియా తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. పదేళ్ల కింద నటించడం ప్రారంభించినప్పుడు ఎంత కష్టాన్నైనా భరించాలని దృఢంగా నిర్ణయించుకున్నానని ఆలియా అన్నారు. అలాగే తన ప్రతిభను ప్రపంచం గుర్తించాలని కోరుకున్నానని చెప్పారు. ‘భావోద్వేగాలను పండించడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటాను. నా శరీర బరువు, రూపాన్ని కాపాడుకోవడానికి కూడా కఠినంగా ఉంటాను’ అని ఆలియా పేర్కొన్నారు. 
Read more: Alia Bhatt: 'మీకు నచ్చకపోతే, నా సినిమాలు చూడొద్దు..’ బాలీవుడ్ (Bollywood) జనాలపై అలియా భట్ ఆగ్రహం..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!