బ్ర‌హ్మాస్త్రం (Brahmastra ) : బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో.. కింగ్ నాగార్జున (Nagarjuna) ప‌వ‌ర్ ఫుల్ లుక్ రిలీజ్ !

Updated on Jun 11, 2022 02:10 PM IST
బ్ర‌హ్మాస్త్రంలో నాగార్జున  (Nagarjuna) ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టిస్తున్నారు.
బ్ర‌హ్మాస్త్రంలో నాగార్జున  (Nagarjuna) ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టిస్తున్నారు.

బ్రహ్మాస్త్రం ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో.. భారీ తారాగణమే నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున.. ఇలా పెద్ద పెద్ద తారలందరూ ఈ చిత్రంలో కనువిందు చేయనున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వేక్ అప్ సిడ్, ఏ జవానీ హై దివానీ లాంటి హిందీ సినిమాలను డైరెక్ట్ చేసిన అయాన్‌కు దక్కిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఈ చిత్రం. 

కీలక పాత్రలో కింగ్ నాగార్జున

బాలీవుడ్ క‌పుల్స్ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్ కలిసి నటించడం బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత. అలాగే ఈ సినిమా సబ్జెక్టు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.  'బ్ర‌హ్మాస్త్రం' సినిమాను చాలా వైవిధ్యమైన రీతిలో ద‌ర్శ‌కుడు ఆయాన్‌ ముఖర్జీ తెర‌కెక్కించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున (Nagarjuna) కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. నాగార్జున ఫ‌స్ట్ లుక్‌ను 'బ్ర‌హ్మాస్త్రం' చిత్ర యూనిట్ ఇటీవలే రిలీజ్ చేసింది.  

బ్ర‌హ్మాస్త్రంలో నాగార్జున  (Nagarjuna) ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టిస్తున్నారు.

నాగార్జున ఆవేశం దేనికోసం..?
బ్ర‌హ్మాస్త్రంలో నాగార్జున  (Nagarjuna) ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టిస్తున్నారు. నాగార్జున్ ఫ‌స్ట్ లుక్ కూడా అదిరిపోయింది. ఈ సినిమా పోస్ట‌ర్‌లో నాగార్జున చాలా ఆవేశంగా క‌నిపించడం గమనార్హం. అంతేకాదు, నాగ్ త‌ల‌కు గాయాలు కూడా ఉన్నాయి. ఓ పోరాట యోధుడి గెటప్‌లో ఆయన కనిపిస్తున్నారు.

నెటిజన్లకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం,  పురావస్తు శాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు.  నాగ్ పోరాటం ఎవరి కోసం? విశ్వ ర‌హ‌స్యాలను చేధించే క్రమంలో, ఆయన ఏర్పరచుకున్న లక్ష్యం ఏమిటి? ముఖ్యంగా శివుడి గురించి ఈ చిత్రంలో ఏం చెప్ప‌ద‌లుచుకున్నారు.. ఇవ‌న్నీ తెలియాలంటే బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

విశాఖకు తరలి వచ్చిన రణ్‌బీర్‌ ..!
'బ్ర‌హ్మాస్త్రం'  చిత్ర ట్రైల‌ర్‌ను జూన్ 15 న రిలీజ్ చేయ‌నున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి స‌మ‌ర్ఫ‌ణ‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకుడు అయాన్‌ ముఖర్జీ, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఇటీవలే విశాఖపట్నంలో పర్యటించారు. సినిమా ప్రమోషన్లను ఎలా చేయాలో రాజ‌మౌళికి తెలిసిన‌ట్టు, మ‌రే ద‌ర్శ‌కుడికి తెలియ‌ద‌నే టాక్ కూడా ఉంది. మరి ఆయన ఈ చిత్రానికి చేసిన ప్రమోషన్లు.. సినిమా విజయానికి దోహదపడతాయో, లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. 

'బ్ర‌హ్మాస్త్రం' టీజ‌ర్‌లో నాగార్జున‌, అమితాబ్ బ‌చ్చ‌న్, మౌనీ రాయ్.. వీరు కలిసి నటించిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని టాక్. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రలో అమితాబ్‌ బచ్చన్ క‌నిపించ‌నున్నారు. మౌనీ రాయ్‌ దమయంతిగా న‌టిస్తున్నారు. 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో.. సెప్టెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

 బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

నది అస్త్రం నా చేతిలో ఉంది - నాగార్జున‌
బ్ర‌హ్మాస్త్రం ప్ర‌పంచంలో ఓ వండ‌ర్ అని నాగార్జున్ అన్నారు.  ఓ శ‌క్తిని తెలిపే సినిమాగా బ్ర‌హ్మాస్త్రం రిలీజ్ కానుంద‌న్నారు. ఇలాంటి అద్భుత‌మైన సినిమాలో తాను న‌టించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని నాగార్జున ట్వీట్ చేశారు. త‌న చేతిలో బ‌హుశా నంది అస్త్రం ఉండి ఉండ‌వ‌చ్చ‌ని నాగ్ ఓ క్లూ కూడా ఇచ్చారు.

త‌న‌కు మంచి రోల్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అయాన్కు కృత‌జ్ఞ‌త‌లంటూ పోస్ట్ పెట్టారు నాగ్.  బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ జూన్ 15న రిలీజ్ అవుతుంద‌ని.. సెప్టెంబ‌ర్ 9 న సినిమా రిలీజ్ అంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా నాగార్జున తెలిపారు.

Read More: ‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్ సింగిల్ తెలుగు ప్రోమో రిలీజ్ చేసిన ద‌ర్శ‌క ధీరుడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!